Poonam Pandey : హద్దులు దాటిన పూనమ్ పబ్లిసిటీ పిచ్చి.. ఇలా ఇంతకు ముందు ఎన్ని సార్లు చేసిందో తెలుసా ?

దేశంలోనే ప్రముఖ శృంగార తారగా, మోడల్‌గా పేరొందిన పూనమ్ పాండే( Poonam Pandey ) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో మరణించిందని శుక్రవారం నుంచి ప్రచారం జరుగుతోంది.అయితే ఈ వార్తను చాలా మంది ప్రజలు నమ్మలేకపోయారు.

2 రోజుల క్రితం కూడా పార్టీలు చేసుకుంటున్న గ్లామర్ వరల్డ్ క్వీన్ పూనమ్ పాండేకి ఏమైందో అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.నిజానికి ఆమె చనిపోయిందని చాలామంది అనుకున్నారు కానీ అది అబద్ధమని తాజాగా ఆమె షేర్ చేసిన ఒక వీడియోతో తెలిసిపోయింది.

ఆ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి ఆ క్యాన్సర్ ( Cervical Cancer ) బారిన పడి చనిపోయినట్లు ఈ నటి తెలియజేసింది.అయితే ఈమె నిజంగానే చనిపోయిందని ప్రముఖ మీడియా సంస్థలు కూడా వార్తలు రాసేశాయి.

తీరా దాని చనిపోలేదని ఉత్త అవగాహన కోసం ఇలా చేశానని చెప్పి ఆమె వీడియో రిలీజ్ చేసింది.అయితే చాలామంది ఆమెను దారుణంగా తిట్టిపోస్తున్నారు.

Advertisement
Poonam Pandey Controversies Details-Poonam Pandey : హద్దులు ద�

ఇలాంటి వరస్ట్ పబ్లిసిటీ స్టంట్ ఎక్కడ చూడలేదని, ఇంకోసారి నువ్వు చచ్చిపోయినా మీడియా వర్గాలు ఎవరూ కూడా ఆ వార్తను రాయరని, ఎవరు నీ కోసం మళ్లీ ఏడవారని పిచ్చి తిట్టుడు తిడుతున్నారు.మతి భ్రమించిందా అని మరికొందరు ఫైర్ అవుతున్నారు.

Poonam Pandey Controversies Details

ఆమె సినీ పరిశ్రమలో నటన, మోడలింగ్‌తో పాటు వివాదాలతో( Poonam Pandey Controversies ) వార్తల్లో నిలిచింది.ఇలా వివాదాల్లో సృష్టించడం ఆమెకు కొత్తేమీ కాదు గతంలో అనేక కాంట్రవర్సీలు సృష్టించింది ఇంటర్నెట్ సంచలనంగా ఆమెకు మరో పేరు ఉంది ముఖ్యంగా ఆమె సృష్టించిన ప్రభంజనాల విషయంలోకి వెళితే మొదట 2011లో బిసిసిఐకి ఇండియా వరల్డ్ కప్( India World Cup ) గెలిస్తే బట్టలు వి పేజీ స్టేడియంలో తిరుగుతాను అంటూ ఒక లెటర్ రాసింది.ఏది ఏమైనా బిసిసిఐ( BCCI ) దానికి స్పందించక పోయిన అప్పట్లో వైరల్ కంటెంట్ గా మారిపోయింది.

Poonam Pandey Controversies Details

ఇక బాత్రూంలో అందాలు ఆరబోస్తూ తడి బట్టలతో మతులు పోగొట్టే ఒక వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది అప్పట్లో ఆ వీడియో ఎంత వైరల్ అయిందంటే ఆ దెబ్బ తో ఆమె ఇంస్టా ఫాలోవర్స్ ఎక్కడికో వెళ్ళిపోయారు.ఇక లాక్ డౌన్ లో ( Lockdown ) రోడ్లమీద తిరుగుతూ అరెస్టు చేయబడింది పూనమ్ పాండే.మరో మారు భర్త తనను వేధిస్తున్నాడు అంటూ డొమెస్టిక్ వాయిలెన్స్ కేసు వేసి అరెస్ట్ చేసి వార్తల్లో నిలిచింది.

ఇక బోల్డు అనే పదానికి మారుపేరుగా నిలిచిన పూనమ్ తన పేరుపై ఒక యాప్ సృష్టించుకుని దాంట్లో అశ్లీల వీడియోలను అప్లోడ్ చేయడం మొదలు పెట్టింది.దానిని గూగుల్ రిమూవ్ చేయడంతో వార్తల్లోకి ఎక్కింది పూనమ్.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు