బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC kavitha ) వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి( Mallu Ravi ) కౌంటర్ ఇచ్చారు.పదేళ్లు బీఆర్ఎస్( Brs party ) ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కవితకు పూలే గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

ఐదేళ్లు మహిళలకు కేబినెట్ లో అవకాశం ఇవ్వనప్పుడు కేసీఆర్ ను కవిత( MLC kavitha ) ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు.పూలే ఆలోచన విధానానికి వ్యతిరేకంగా కేసీఆర్ పరిపాలన చేశారని ధ్వజమెత్తారు.కేసీఆర్( KCR ) మహిళలతో పాటు బీసీలకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.గతంలో ఎప్పుడూ లేనంతగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని పేర్కొన్నారు.తమది ప్రజా ప్రభుత్వమని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.







