అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తలపడుతున్న జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్‌ల( Joe Biden, Donald Trump ) మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది.వీలు చిక్కినప్పుడల్లా బైడెన్ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు ట్రంప్.
అటు బైడెన్ కూడా అదే స్థాయిలో ఘాటుగా బదులిస్తున్నారు.తాజాగా బైడెన్‌పై మండిపడ్డారు డొనాల్డ్ ట్రంప్.
పొలిటికో ప్రకారం.అధ్యక్షుడు ఇటీవల ట్రంప్ గురించి క్లోజ్డ్ డోర్ సంభాషణలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దానికి ప్రతిస్పందనగా.“BIDEN JUST CALLED ME A SICK F-WORD ’’ అనే శీర్షికతో తన నిధుల సేకరణ ఈమెయిల్‌లో మద్ధతుదారులను ఉద్దేశించి ట్రంప్ రాశారు.
అతను (బైడెన్) తన గురించి మాత్రమే ఆలోచించడం లేదని , తన మద్ధతుదారులలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడని ట్రంప్ వ్యాఖ్యానించారు.మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ ( Hillary Clinton )మమ్మల్ని డిప్లోరబుల్స్ ని పిలుస్తున్నారని మద్ధతుదారులను ఉటంకిస్తూ మాజీ అధ్యక్షుడు పేర్కొన్నారు.
బైడెన్ మనపై ఉమ్ము వేసేందుకు యత్నిస్తున్నాడని, డిక్షనరీలో లేని పదాలను వాడుతాడని ట్రంప్ దుయ్యబట్టారు.మీరు అమెరికాను ప్రేమిస్తున్నందున నేను మిమ్మల్ని ప్రేమించడం ఎప్పటికీ ఆపనని డొనాల్డ్ ట్రంప్ ఈ మెయిల్‌లో పేర్కొన్నారు.

మద్ధతుదారులు ‘‘ ఐ లవ్ ప్రెసిడెంట్ ట్రంప్ ’’ అని లేబుల్ చేసిన రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయమని ఆయన ఆ మెయిల్‌లో కోరారు.అది వారిని 3,300 డాలర్లు విరాళం ఇచ్చే పేజీకి తీసుకెళ్తుంది.ట్రంప్ ప్రచార బృందానికి చెందిన ఓ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.మాజీ అధ్యక్షుడి గురించి చర్చించేటప్పుడు బైడెన్ అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగించడంపై తాము ఎలాంటి ఆశ్చర్యానికి లోనుకావడం లేదన్నారు.

కాగా.ఆర్ధిక పెట్టుబడులు, చట్టపరమైన విషయాలు , అధ్యక్ష ఎన్నికల ముందు దివాలా తదితర తప్పిదాల కారణంగా ట్రంప్ గడిచిన రెండేళ్లలో లీగల్ ఫీజుల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.న్యూయార్క్ యూనివర్సిటీ ( New York University )అకౌంటింగ్ ప్రొఫెసర్ అయిన ఎలి బార్టోవ్‌లో ట్రంప్ పెట్టుబడులు పెట్టడం ఆయనపై ఆర్ధికంగా మరింత ఒత్తిడిని పెంచుతోంది.ఫెడరల్ ఎలక్షన్ కమీషన్‌కు దాఖలు ప్రకారం.
డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని భయపెడుతోన్న న్యూయార్క్ అటార్నీ జనరల్ సివిల్ ఫ్రాడ్ కేసులో నిపుణుల సాక్షిగా ట్రంప్‌కు చెందిన సేవ్ అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీ గతేడాది బార్టోవ్‌కు దాదాపు 9,30,000 డాలర్లు చెల్లించింది.ఇంతలో ట్రంప్ నుంచి నిధుల సేకరణ నిమిత్తం రిపబ్లికన్ మద్ధతుదారులకు ఈ మెయిల్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.








