వినికిడి లోపానికి చెక్ పెట్టే దానిమ్మ తొక్కలు.. ఎలా వాడాలో తెలుసా?

పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తినే పండ్లలో దానిమ్మ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.ఖరీదు కూడా కాస్త ఎక్కువే.

కానీ అందుకు తగ్గ పోషక విలువ‌లు దాన్నిమ్మ పండులో పుష్కలంగా నిండి ఉంటాయి.అందుకే దానిమ్మ పండు ఆరోగ్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

వివిధ ర‌కాల జ‌బ్బులు ద‌రి చేర‌కుండా అడ్డుక‌ట్ట వేస్తుంది.అయితే చాలా మంది తెలుసో తెలియకో దానిమ్మ తొక్కల‌ను ఒలిచి పారేస్తుంటారు.

కానీ, దానిమ్మ గింజలే కాదు తొక్కలు సైతం మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.బోలెడ‌న్ని ఆరోగ్య ప్రయోజనాలను సైతం అందిస్తాయి.

Advertisement
Pomegranate Peel Helps To Get Rid Of Hearing Loss Details! Pomegranate Peel, Hea

ముఖ్యంగా వినికిడి సమస్యతో బాధపడుతున్న వారికి దానిమ్మ తొక్కలు ఒక వరం అని చెప్పవచ్చు.ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వచ్చే వినికిడి సమస్యను దానిమ్మ తొక్కలు సమర్థవంతంగా నివారించగలవు.

అందుకోసం, కొన్ని దానిమ్మ తొక్కలను తీసుకుని నీటిలో శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత వాటిని కచ్చాపచ్చాగా దంచుకుని పెట్టుకోవాలి.

ఆపై స్టావ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాట‌ర్ కాస్త హీట్ అవ్వ‌గానే అందులో దంచి పెట్టుకున్న దానిమ్మ తొక్క‌లు వేసి కనీసం ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

Pomegranate Peel Helps To Get Rid Of Hearing Loss Details Pomegranate Peel, Hea

ఆ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని సేవించాలి.రోజుకు ఒకసారి ఇలా చేస్తే దానిమ్మ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ వినికిడి సమస్యను క్రమంగా దూరం చేస్తుంది.అలాగే దానిమ్మ తొక్కలను మరిగించిన నీటిని తీసుకోవడం వల్ల దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, మలినాలు తొలిగిపోతాయి.బాడీ డిటాక్స్ అవుతుంది.చర్మం నిగారింపుగా మరియు ఆరోగ్యంగా మారుతుంది.

Advertisement

వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా సైతం ఉంటాయి.ఇన్ని ప్రయోజనాలను అందించే దానిమ్మ తొక్కలను ఇకపై అస్సలు పారేయకండి.

తాజా వార్తలు