ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై ప్రధాని మోదీ సీరియస్ వ్యాఖ్యలు..!!

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నాయి.

ఈ క్రమంలో గురువారం నవంబర్ రెండవ తారీకు ఛత్తీస్‌గఢ్‌ లోని కాంకేర్ లో బీజేపీ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఛత్తీస్‌గఢ్‌ లో కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ అభివృద్ధి రెండు ఒక దగ్గర ఉండలేవని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శలు చేశారు.

Advertisement

ఇదే సమయంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అవినీతి చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాన్ని దేశంలో అగ్ర రాష్ట్రాల జాబితాలో నిలపటమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు.ఓబీసీ వర్గానికి చెందిన తనను 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు దూషించే వారని ప్రధాని మోదీ ఆరోపణ చేశారు.

కుటుంబ పాలన, బంధుప్రీతి, అవినీతి అనేవి కాంగ్రెస్ విధానాలు.గతంలో అనేక హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ఛత్తీస్‌గఢ్‌ యువతను కాంగ్రెస్ మోసం చేసింది.కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో ఆ పార్టీకి చెందిన నేతల పిల్లలు మరియు బంధువులే ప్రయోజనం పొందారు.

పేదలకు ఎలాంటి మేలు జరగలేదు అని ప్రధాని మోదీ ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అమల్లోకి వచ్చిన కోడ్!
Advertisement

తాజా వార్తలు