పోకిరి రికార్డ్ బ్రేక్స్ అయ్యాయా.. జల్సా రీ రిలీజ్ కలెక్షన్స్ ఎంతంటే?

తెలుగు వారి అభిమానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఒక్కసారి ఏ హీరోకు అయినా ఫ్యాన్ అయినారంటే ఇక వారిని ఎంతగా అభిమానిస్తారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.

అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.ఇక వారి పుట్టిన రోజులను ఎంతగా సెలెబ్రేట్ చేస్తారో కూడా చూస్తూనే ఉంటాం.

వారి పుట్టిన రోజులకు కూడా అంతా హంగామా చెయ్యరు.కానీ తమ హీరో పుట్టిన రోజు అంటే మాత్రం ఒక నెల ముందు నుండే హంగామా స్టార్ట్ అవుతుంది.

అయితే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఫ్యాన్స్ కూడా తమ ట్రెండ్ మార్చి బర్త్ డే లను సెలెబ్రేట్ చేస్తున్నారు.తమ అభిమాన హీరో కెరీర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచి పోయిన సినిమాలను వారి పుట్టిన రోజు వేడుకలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ వారి అభిమానాన్ని చాటుతున్నారు.

Advertisement
Pawan Kalyan Jalsa Re-release Breaks Mahesh Babu Pokiri Record Details, Pokiri,

ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన పోకిరి సినిమాను ఆయన పుట్టిన రోజు సందర్భంగా 4K రిజొల్యూషన్ లోకి రీ మాస్టర్ చేసి డాల్ఫీ ఆడియోతో థియేటర్స్ లో రిలీజ్ చేసారు.ఈ రీ రిలీజ్ కు ఫ్యాన్స్ నుండి బాగా స్పందన లభించింది.

ఇక నిన్న పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ ఫ్యాన్స్ కోసం జల్సా సినిమా రీ రిలీజ్ చేసారు.

Pawan Kalyan Jalsa Re-release Breaks Mahesh Babu Pokiri Record Details, Pokiri,

2008లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఈ సినిమా మళ్ళీ థియేటర్స్ లో కూడా అంతే రెస్పాన్స్ తెచ్చుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికాలో సైతం ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది.ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరుస్తుంది.మహేష్ బాబు పోకిరి రీ రిలీజ్ కు 1.5 కోట్ల కలెక్షన్స్ అందుకోగా.జల్సా సినిమా ఈ రికార్డ్ ను బ్రేక్ చేసింది.ఈ సినిమా ఏకంగా 2.85 కోట్ల వసూళ్లు అందుకుని రీ రిలీజ్ క్యాటగిరీలో ఆల్ టైం రికార్డ్ సెట్ చేసింది.దీనిని బట్టి పవర్ స్టార్ కు ఎంత క్రేజ్ ఉందొ అర్ధం అవుతుంది.

మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ ను బీట్ చేసే సత్తా ఎవరికీ ఉందో చూడాలి.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు