ఎన్డీయేలో నుంచి బయటకు వస్తే నేనే చెబుతా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర జరుగుతున్న సంగతి తెలిసిందే.

అక్టోబర్ మొదటి తారీకు నుండి జరుగుతున్న ఈ యాత్రలో ఇప్పటికే అవనిగడ్డ, పెడన నియోజకవర్గలలో బహిరంగ సభలు నిర్వహించారు.

గురువారం అక్టోబర్ 5వ తారీఖు కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లిలో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.2014లో ఆదరించిన కైకలూరు ప్రజలను గుండెల్లో పెట్టుకుంటానని వ్యాఖ్యానించారు.సభాస్థాలికి వస్తున్నప్పుడు దారి పొడవున ప్రజలు స్వాగతం పలికారు వాళ్ళందరికీ ధన్యవాదాలు.

ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం పై సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

151 మంది ఎమ్మెల్యేలు 30 మంది ఎంపీలు.ఇది వైసీపీ పార్టీ బలం.ఏ పదవిలేని జనసేన పార్టీకి కేవలం జన సైనికులే బలం.తాము ఎవరికీ భయపడబోమని స్పష్టం చేశారు.ఇక ఇదే సమయంలో ఎన్డీయే నుంచి జనసేన బయటకు వచ్చేసింది అనే వార్తలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.

Advertisement

"జనసేన.ఎన్డీయే నుండి బయటకు వచ్చిందని వైసీపీ చెబుతోంది.

నేను ఎన్డీయే కూటమి నుంచి బయటకు వస్తే నేనే చెబుతా.బయటకు రావాలనుకుంటే చెప్పే చేస్తా.

దొంగ చాటుగా చెయ్యను.మేం కూటమిలో ఉంటే మీకేంటి.

లేకపోతే మీకేంటి.? పథకాలకు డబ్బులు ఇస్తూ కూడా మాకు భయపడుతున్నారంటే దాని అర్థం ఓడిపోతున్నారనే.మీరు ఇంకా భయపడాలి అంటూ పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
వారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది .. కేటీఆర్ సెటైర్లు 

మాపై దృష్టి వదిలేసి మీ గురించి చూసుకోండి అని విమర్శించారు.ఇక ఇదే సమయంలో తాము ఎన్డీయేలోనే ఉన్నామని పవన్ సభాముఖంగా స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు