మరో సారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్‌ను ఎంత మాట అన్నారంటే.. ?

కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వ్యవహారాలు చక్కగానే కొనసాగుతున్నాయి కానీ, తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు.

ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించడంలో ఏమాత్రం తగ్గడం లేదు.

ఈ క్రమంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.కరోనా వచ్చినప్పుడు ఒక పార సీటమాల్ వేసుకుంటే సరిపోతుందని మాట్లాడిన సీఎం ఇప్పుడు వైద్య మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు.

Once Again Bandi Sanjay Sensational Comments On Kcr, Telangana, Bjp, Bandi Sanja
Once Again Bandi Sanjay Sensational Comments On Kcr, Telangana, BJP, Bandi Sanja

ఇక దేశాన్ని కరోనా మహమ్మారి నుండి కాపాడేందుకు వాక్సిన్ తయారీలో మోడీ చూపించిన చొరవకు, ఇతర రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలపగా, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ఉన్న సంస్కార హీనుడని మండిపడ్డారు బండి సంజయ్.తెలంగాణ సీఎం రాష్ట్రానికి చేసింది ఏం లేదని, ఎప్పుడు కేంద్రాన్ని విమర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు.ఇక ఆరోగ్య శ్రీ లో కరోనాను చేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నాడంటూ ఆరోపించారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు