ఐటి హబ్ లో ఈవీఎంలకు భద్రత లేదు: పెద్దిరెడ్డి రాజా

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని ఐటి హబ్ లో ఈవీఎంలు భద్రపరచడం పలు అనుమానాలకు దారితీస్తుందని,వెంటనే ఈవీఎంలను అక్కడి నుండి తరలించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా అన్నారు.

జిల్లా కేంద్రంలోని ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు అడ్డగోలుగా హామీలు ఇస్తున్నారని,ఆ హామీలను నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదని,గత పది సంవత్సరాలుగా మంత్రిగా ఉన్న విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కుల సంఘాలు, యూనియన్లకు ఎరవేస్తూ ప్రొసీడింగ్ లేకుండా శంకుస్థాపన చేస్తున్నారని, ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు విచ్చలవిడిగా డబ్బు ఆశ చూపుతూ బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటూ ప్రలోభాలకు తెర తీశారని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ 6 డిక్లరేషన్స్ తో కేసీఅర్ కు మైండ్ బ్లాక్ అయిందని, ఉద్యోగుల జీతాలు ఒకటో తారీఖున ఇచ్చే పరిస్థితి లేదన్నారు.

టీఆర్ఎస్ నుంచి,బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించిందని, అయితే మహారాష్ట్రలో ఖాళీ అయిందని,ఇక తెలంగాణలో కూడా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు.ఎలక్షన్లు రాగానే తెలంగాణ వాదం ఎత్తి, మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఎత్తుగడతో తెలంగాణ వాదాన్ని తీసుకొస్తారని,సెంటి మెంట్ తో ఈ సారి బయట పడలేరని ఎద్దేవా చేశారు.

కొత్త రుణం కావాలంటే ఆగాలంటున్న మోతె ఎస్బీఐ బ్యాంక్
Advertisement

Latest Suryapet News