ఫ్లాప్‌ ఇచ్చిన దర్శకుడితో మళ్లీ!

నితిన్‌ వరుస పరాజయాలతో సతమతమవుతున్న సమయంలో ‘ఇస్క్‌’తో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు.

ఆ తర్వాత వచ్చిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్‌ ఎటాక్‌’, ‘చిన్నదాన నీకోసం’ సినిమాలు కూడా నితిన్‌కు మంచి ఫలితాన్ని తెచ్చి పెట్టాయి.

ఇక త్వరలో నితిన్‌ ‘కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఆ సినిమా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయ్యింది.

Nithin Another Movie With Director AS Ravikumar-Nithin Another Movie With Direct

ఆ సినిమా తర్వాత నితిన్‌ ఎవరి దర్శకత్వంలో నటించబోతున్నాడు అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది.గతంలో తనతో ‘ఆటాడిస్తా’ సినిమా చేసిన రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో నితిన్‌ తర్వాత సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

రవికుమార్‌ చౌదరి తాజా సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’.ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Advertisement

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌కు మంచి ఎంట్రీని ఇచ్చింది.దాంతో ‘ఆటాడిస్తా’ సినిమాతో తనకు ఫ్లాప్‌ ఇచ్చినా కూడా మళ్లీ దర్శకుడు రవికుమార్‌ చౌదరికి మరో అవకాశం ఇవ్వాలని నితిన్‌ భావిస్తున్నాడు.

ఇటీవలే వీరిద్దరి మద్య కథా చర్చలు కూడా జరిగినట్లుగా తెలుస్తోంది.ఒక చక్కని ప్రేమకథను ఎంటర్‌టైన్‌మెంట్‌ మిక్స్‌ చేసి తెరకెక్కించాలని దర్శకుడు భావిస్తున్నాడు.

ఈ సినిమా వేసవిలో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.ఫ్లాప్‌ కాంబినేషన్‌గా పేరు పడ్డ వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు