భారీ ధర పలికిన నిఖిల్ 'కార్తికేయ 2' సినిమా రైట్స్ !

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిఖిల్ సిద్దార్థ్ తన టాలెంట్ తో వరస హిట్లు కొట్టి మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలదొక్కుకున్నాడు.

అతడి కెరీర్ లో కార్తికేయ సినిమా ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

లాక్ డౌన్ లో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యిన నిఖిల్ ఒక్క సూపర్ హిట్ తో తన కెరీర్ ను కూడా గాడిలో పెట్టుకోవాలని చూస్తున్నాడు.ప్రెసెంట్ నిఖిల్ కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమా చేస్తున్నాడు.

చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.కార్తికేయ సినిమా కన్నా భారీ ఖర్చుతో మంచి విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ గుజరాత్ లోని ద్వారకా లో 20 రోజుల పాటు జరిగింది.రెండవ షెడ్యూల్ హిమాచల్ ప్రదేశ్ లోని కులుమనాలి లో షూట్ జరిపింది చిత్ర యూనిట్.

Nikhil Karthikeya 2 Movie Rights Sold, Karthikeya 2, Nikhil, Chandu Modeti, Movi
Advertisement
Nikhil Karthikeya 2 Movie Rights Sold, Karthikeya 2, Nikhil, Chandu Modeti, Movi

ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.దాదాపు 5118 సంవత్సరాల క్రితం కథతో చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.అనంత సంపద కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాను టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు.నిఖిల్ కెరీర్ లో ఇది పెద్ద బడ్జెట్ సినిమా.

Nikhil Karthikeya 2 Movie Rights Sold, Karthikeya 2, Nikhil, Chandu Modeti, Movi

అయితే ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ వచ్చింది.ఈ సినిమా అన్ని భాషల శాటిలైట్ రైట్స్ ఇంకా ఇతర డబ్బింగ్ హక్కులు కూడా 20 కోట్లకు అమ్ముడుపోయాయని సమాచారం.అప్పుడప్పుడు పోస్టర్స్ తప్ప టీజర్ కూడా రిలీజ్ అవ్వకుండానే ఈ సినిమా భారీ ధరకు అమ్ముడు పోవడంతో ఈ సినిమాపై ఇంకా అంచనాలు పెరుగుతున్నాయి.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు