ఆర్జీవీతో జాగ్రత్తగా ఉంటే బెటర్.. అతన్ని నమ్మారో అంతే సంగతులు అంటూ?

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మనందరికీ తెలిసిందే.తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ.

ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ లేదంటే సమాజంలో జరిగే విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా వ్యాఖ్యలను సంధిస్తూ ఉంటాడు.ఇంకా చెప్పాలి అంటే రామ్ గోపాల్ వర్మకు వివాదం లేనిదే నిద్ర పట్టదు అని చెప్పవచ్చు.

దర్శకుడుగా కంటే వివాదాస్పద దర్శకుడుగానే రామ్ గోపాల్ వర్మ బాగా పాపులర్ అయ్యాడు.మరి ముఖ్యంగా బోల్డ్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఎక్కువగా వార్తలో నిలుస్తూ ఉంటాడు.

ఇకపోతే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఎలా ఉంటారో ఆయన మైండ్ సెట్, మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అని చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం.

Advertisement

ఇకపోతే ఈ మధ్యకాలంలో కాస్త రూట్ మార్చిన రామ్ గోపాల్ వర్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఎక్కువగా రాసుకుపోసుకు తిరుగుతున్నారు.ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద ఒక సినిమాను, అలాగే ఎంపీ మిధున్ రెడ్డి, టిడిపి బోర్డు మెంబర్ దాసరి కిరణ్ కుమార్ లతో కలిసి నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు.తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ టూర్ ని మొదలు పెట్టేసాడు.

ఇంకా చెప్పాలి అంటే వైకాపా జనాల ఇళ్లల్లో ముచ్చట్లు కూడా పెడుతున్నారు.అదంతా వైసిపి పార్టీకి నెగిటివ్ అవుతుంది తప్ప పాజిటివ్ కాదు అన్న విషయం అందరికీ తెలిసిందే అది వాస్తవమే అయినప్పటికీ జగన్ కు తప్పక అరగంటసేపు రాంగోపాల్ వర్మకి అపాయింట్మెంట్ ఇచ్చాడు.

జగన్ మీద సినిమా తీస్తా అంటున్నాడు రాంగోపాల్ వర్మ.

జగన్ని కలిసిన కలవకపోయినా సినిమాను తీస్తాను అనడంతో జగన్ కూడా రాంగోపాల్ వర్మ ని కలిశారు.అప్పటినుండి వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వకాల్తా పుచ్చుకున్నట్లు కమ్మ కాపు బంధం పై మాటల తూటాలు విసురుతున్నాడు.దీంతో అసలు రాంగోపాల్ వర్మ ఏం చేస్తున్నాడు అసలు ఏం జరుగుతుందో చాలామందికి అర్థం కాక తలగిక్కుంటున్నారు.

ఒకప్పుడు చదువులో ఫెయిల్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
ఆ షాట్స్ ను డైరెక్ట్ గా కాపీ కొడతాను.. వైరల్ అవుతున్న జక్కన్న సంచలన వ్యాఖ్యలు!

ఎందుకంటే ఎప్పుడు రాంగోపాల్ వర్మ ఎలా ఉంటారో ఆయనకే తెలియదు.ఆయన ధోరణి ఆయనదే తప్ప మరొకరికి తెలియదు.అటువంటిది ఇప్పుడు వైకాపా కి మద్దతుగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతుండడంతో రాంగోపాల్ వర్మ ని నమ్మకండి రా బాబు, ఆర్జీవి తో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్ అతన్ని నమ్మారు అంటే అంతే సంగతులు అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు