కొత్త కారు కొన్న చిరుత బ్యూటీ నేహాశర్మ.. ఆ కారు ఖరీదెంతంటే?

రామ్ చరణ్( Ram Charan ) హీరోగా తెరకెక్కిన చిరుత( Chirutha ) సినిమాతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిన నేహాశర్మ( Nehasharma ) ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించినా ఆ సినిమాలతో ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అయితే సొంతం చేసుకోలేదు.

అయితే బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిన నేహా శర్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం సక్సెస్ సాధించారు.

తాజాగా ఈ బ్యూటీ కొత్త కారు కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్( Bollywood ) ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్న ఈ బ్యూటీ ఖరీదైన కారును కొనుగోలు చేసి అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది.ఈ మెర్సిడెస్ కారు విలువ కోటీ 9 లక్షల రూపాయలు కావడం గమనార్హం.

నేహాశర్మ తన ట్విట్టర్ పోస్ట్ లో మనం కష్టపడి పని చేస్తూనే ఉంటామని దేవుడు మన విషయంలో ఎప్పుడూ దయతో వ్యవహరిస్తూ ఉంటాడని అన్నారు.మనం కూడా దేవుని విషయంలో కృతజ్ఞతతో వ్యవహరించాలని నేహాశర్మ అన్నారు.నేహాశర్మ ట్విట్టర్ పోస్ట్ కు 9800కు పైగా లైక్స్ వచ్చాయి.

Advertisement

ప్రస్తుతం ఈ బ్యూటీ జోగిరా సారా రా అనే క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తుండటం గమనార్హం.

మహా అక్షయ్ చక్రవర్తి, సంజయ్ మిశ్రా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.కుషన్ నంది డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.నేహాశర్మ కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న సంగతి తెలిసిందే.

నేహాశర్మ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు