కాంగ్రెస్ పార్టీలో చేరిన నారాయణపూర్ యువకులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ముదిరాజ్ యువకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల యువకులు బాగా ఆకర్షితం అవుతున్నారని, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు చదువులో కూడా వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక చదువు కూడా భారంగా మారిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్,గ్రామ శాఖ అధ్యక్షుడు దొమ్మాటి రాజు, నాయకులు జెల్ల రవి ,గణేష్, సురేష్ పాల్గొన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News