క‌ర‌క్కాయను ఇలా తీసుకుంటే..వేగంగా బ‌రువు త‌గ్గుతార‌ట‌?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల మందిని అధిక బ‌రువు స‌మ‌స్య ప‌ట్టి పీడిస్తున్న సంగ‌తి తెలిసిందే.బ‌రువు పెర‌గ‌డం వ‌ల్ల లావుగా క‌నిపించ‌డం మాత్ర‌మే కాదు.

అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా చుట్టు ముట్టేస్తుంటాయి.అందుకే అధిక బ‌రువును నియంత్రించుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.

ఈ నేప‌థ్యంలో చాలా మంది డైటింగ్లు, వ‌ర్కౌట్లు చేస్తూ, బ‌రువును త‌గ్గించుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంటారు.అయితే బ‌రువును కోల్పోయేలా చేయ‌డంలో క‌ర‌క్కాయ కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ఎన్నో ఔష‌ధ గుణాలు నిండి ఉన్న క‌ర‌క్కాయను పూర్వ కాలం నుంచి అనేక రోగాలకు నివారిణిగా ఉప‌యోగిస్తున్నారు.ముఖ్యంగా అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న వారు ఒక గ్లాస్ ప‌ల్చ‌టి మ‌జ్జిగ‌లో అర స్పూన్‌ క‌ర‌క్కాయ పొడిని క‌లిపి భోజ‌నం చేయ‌డానికి ముందు సేవించాలి.

Advertisement
Myrobalan Can Reduce Over Weight! Myrobalan, Benefits Of Myrobalan, Over Weight,

ఇలా ప్ర‌తి రోజు చేస్తే ఖ‌చ్చితంగా ఒంట్లో కొవ్వు క‌రుగుతుంది  ఫ‌లితంగా బ‌రువు త‌గ్గుతారు.

Myrobalan Can Reduce Over Weight Myrobalan, Benefits Of Myrobalan, Over Weight,

అలాగే క‌ర‌క్కాయ‌తో మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.మ‌రి లేట్ చేయ‌కుండా వాటిపై కూడా ఓ లుక్కేసేయండి.సాధార‌ణంగా చాలా మంది త‌మ ప‌ళ్ళు తెల్ల‌గా లేవ‌ని ఇబ్బంది ప‌డుతూ ఉంటారు.

అలాంటి వారు క‌ర‌క్కాయ పొడిలో కొద్ది ఉప్పు చేర్చి.ఆ మిశ్ర‌మంతో దంతాల‌ను తోముకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాలు తెల్ల బ‌డ‌టంతో పాటు చిగుళ్లు వాపు త‌గ్గి దృఢంగా మార‌తాయి.

Myrobalan Can Reduce Over Weight Myrobalan, Benefits Of Myrobalan, Over Weight,
అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

త‌ల‌నొప్పిని త‌గ్గించ‌డంలోనూ క‌ర‌క్కాయ ఉప‌యోగ‌ప‌డుతుంది.క‌ర‌క్కాయను నీటి సాయంతో అర‌గ‌దీసి.ఆ పేస్ట్‌ను నుదుటపై అప్లై చేసుకోవాలి.

Advertisement

ఇలా చేస్తే క్ష‌ణాల్లోనే త‌ల‌నొప్పి త‌గ్గు ముఖం ప‌డుతుంది.ఇక ఒక గ్లాస్ వాట‌ర్‌లో అర స్పూన్ క‌ర‌క్కాయ పొడిని క‌లిపి ప్ర‌తి రోజు సేవిస్తే.

పొడి ద‌గ్గు త‌గ్గుతుంది.రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.దాంతో బ్యాక్టీరియాలు, వైర‌స్‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

తాజా వార్తలు