వీడిన మర్డర్ మిస్టరీ...!

సూర్యాపేట జిల్లా: పొలం వద్ద గెట్టు పంచాయతీనే ఒక వ్యక్తి ప్రాణం తీసిందని డీఎస్పీ రవి తెలిపారు.

గురువారం సూర్యాపేట జిల్లా చివ్వేంల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన హత్య కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు.

డిసెంబర్ 31వ తేదీన లక్ష్మీనాయక్ తండాకు చెందిన శేషు హత్యకు గురి కాగా కేసు నమోదు చేసుకున్న చివ్వెంల పోలీసులు పది రోజుల్లో కేసు మిస్టరీని ఛేదించారని,వ్యవసాయ పొలం గెట్టు పంచాయతీనే హత్యకు దారి తీసిందన్నారు.ఈ హత్య కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని,వారి వద్ద నుండి 4 సెల్ ఫోన్లు,మూడు ద్విచక్ర వాహనాలు,హత్యకు ఉపయోగించిన ఒక కత్తి స్వాధీనం చేసుకొని, హంతకులను రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో సీఐ రాజశేఖర్, ఎస్ఐ మహేశ్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇసుక ట్రాక్టర్ పల్టీ పాదచారునికి తీవ్ర గాయాలు
Advertisement

Latest Suryapet News