మ‌రోసారి అలాంటి కామెంట్లు చేసిన ఎంపీ.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్లు

వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంపై అనేక మంది సినీ పెద్దలతో పాటు సామాన్యులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

కొంత మంది ట్వీట్ల రూపంలో తమ అసహనాన్ని తెలియజేస్తున్నారు.అయినా కానీ ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు.

తగ్గించిన సినిమా టికెట్ల ధరలను పెంచే ప్రసక్తే లేదని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ స్పందించారు.

తను ట్వీట్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా డబ్బులను ప్రజలకు చేరవేస్తేనే సినీ ఇండస్ట్రీ బాగుపడుతోందని అన్నారు.ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ భరత్ రామ్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

అవునా ప్రభుత్వం అందజేసే సొమ్మలు మోహన్ బాబు కుటుంబం చేతిలోకి వెళ్తున్నాయని ఒకరు ట్వీట్ చేయగా.అరిస్తే కరుస్తా.

కరిస్తే చరుస్తా చరిస్తే పదవి నుంచి దించేస్తా అని ఒక్క సారి జగనన్న వద్దకు వెళ్లి అనమని మోహన్ బాబుకు కూడా సలహా ఇస్తున్నారు.ఇంకొకరు మాట్లాడుతూ.

లిక్కర్ ధరల గురించి కూడా చెప్పమని అడిగాడు.

లిక్కర్ ధరలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయా అని ప్రశ్నించారు.మీరు అలా మాట్లాడితే ఏం సమాధానాలు చెబుతారు.అసలే వాళ్లవి అసత్య ఆరోపణలు అంటూ వ్యంగంగా ట్వీట్లు చేస్తున్నారు.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం

ఇది వరకు కూడా ఎంపీ మార్గాని భరత్ రామ్ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఇక ఇప్పుడు కూడా నెటిజన్లు యువ ఎంపీ చేసిన వ్యాఖ్యల పట్ల విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ల వ్యవహారాన్ని ఇంతటితో ముగింపు చెబుతుందో లేదో?.

తాజా వార్తలు