పనీ పాటా లేకుండా తిరుగుతున్నాడని కన్న కొడుకునే కడతేర్చిన తల్లి

ఏ పనీ చేయకుండా ఊర్లో కాలీగా తిరుగుతున్నాడని ఓ తల్లి తన కన్న కొడుకుని దారుణంగా చున్నీతో మెడకు బిగించి చంపిన ఘటన రంగ రెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

  వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలో మాడ్గుల మండలంలో పల్లె తండాలో చాందీ అనే మహిళ తన కొడుకైనటువంటి హరి లాల్ తో కలిసి నివాసం ఉంటున్నారు.

అయితే చాందీ గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ వచ్చేది.ఈ క్రమంలో ఆమె కొడుకు హరిలాల్ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉండేవాడు.

దీంతో ఆమె పలుమార్లు తన ఒక్కదానివల్లే కుటుంభ పోషణ భారం అవుతుందని కావున ఖాళీగా తిరగకుండా ఏదైనా పని చేసుకొమ్మని అతడికి చెబుతూ నిత్యం చెబుతూ ఉండేది.అయితే ఎన్నిసార్లు చెప్పినా ఆమె మాటను లెక్క చేయకుండా హరిలాల్ బలాదూర్ గా తిరుగుతుండేవాడు.

దాంతో ఈ విషయమై హరిలాల్ కి మరియు అతడి తల్లి చాందీకి పలుమార్లు గొడవలు కూడా జరిగేవి.దీంతో చుట్టూ ప్రక్కలవారు వారికి సర్ది చెప్పేవారు.

Advertisement
Motherkilledher Son In Ranga Reddy District-పనీ పాటా లేకు

ఈ క్రమంలో ఈ నెల 22వ తారీఖున వారిద్దరూ మళ్ళీ గొడవ పడ్డారు.ఈ గొడవలో చాందీ హరిలాల్ కి ఊపిరి ఆడకుండా చున్నీతో బిగించి  చంపేసింది.

దీంతో భయపడిన ఆమె హరిలాల్ మృత దేహాన్ని తన ఇంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి ముళ్ల పొదల్లో విసిరేసింది.అనంతరం ఏమీ ఎరగనట్లు ఉండిపోయింది.

అయితే మృతదేహం వాసన రావడాన్ని గమనించిన చుట్టుప్రక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు.

Motherkilledher Son In Ranga Reddy District

సమాచారం అందుకున్న పోలీసులు  సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తమై దగ్గర్లోని  ఆసుపత్రికి తరలించారు.అయితే ఇది ఇలా ఉండగా మృతుడి తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా పని పాటాలేకుండా జులాయిగా తిరుగుతున్నాడని హరిలాల్ ని తానే చంపినట్లు నేరం అంగీకరించింది.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు