మెయిన్ రోడ్ కు మోక్షం తారు పనులు ప్రారంభం...!

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారి మెయిన్ రోడ్ విస్తరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విస్తరణ పనులకు మోక్షం లభించింది.

గత వారం రోజుల నుండి జరుగుతున్న విస్తరణ పనుల్లో భాగంగా గురువారం ఉదయం తారు రోడ్డు వేసే ప్రక్రియ వేగవంతం చేశారు.

ఇంతకాలం గుంతల మట్టి రోడ్డులో రాకపోకలు లేక, మడిగలు ఖాళీగా ఉండి వ్యాపారాలు కుంటుపడి, కిరాయిలు కట్టలేక కొందరుంటే,స్వంత దుకాణాలు నడిపేవారు కూడా అప్పుల పాలైన పరిస్థితి దాపురించింది.విస్తరణ పనులు మొదలైన తరువాత వ్యాపారులు సంతోషంగా కనిపిస్తున్నారు.

Moksham Asphalt Work Has Started For The Main Road...!-మెయిన్ రో

తారు రోడ్డు వేయడంతో మెయిన్ రోడ్ రూపు రేఖలు మొత్తం మారిపోయాయి.ఇకపై మడిగలు అద్దెకు దొరికే పరిస్థితి లేదు.

పూలసెంటర్,బొడ్రాయి బజార్ రోడ్డులో పూజ వస్తువులు,స్టీల్,రాతెండి, ఇత్తడి,బంగారు నగలు, బట్టల దుకాణాలు కస్టమర్ లతో కళకళలాడుతాయని వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?

Latest Suryapet News