మరో సంచలన నిర్ణయం దిశగా మోదీ అడుగులు..?

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా సంక్షేమ పాలన దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రధాని మోదీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నా భవిష్యత్తులో చాలా ప్రయోజనాలు చేకూరుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారు.

మోదీ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేయనున్నట్టు కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు.ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల్లోని సెక్షన్లను మార్చే దిశగా కేంద్రం అడుగులు వేయబోతుందని.

Modi Govt To Make Changes In IPC,CRPC, Modi Govt Kishan Reddy,BJP Government

రాష్ట్రపతి, గవర్నర్ లకు తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లు క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని.క్షమాభిక్షకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.నిపుణులు ఐపీపీ, సీఆర్‌పీసీ చట్టాల సవరణ కొరకు ఇప్పటికే అధ్యయనం నిర్వహిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

బీజేపీ వర్గాలు మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సాహసోపేతమైన నిర్ణయంగా పేర్కొన్నారు.ఇప్పటికే చట్టాలలో మార్పుల దిశగా కసరత్తు మొదలు కావడంతో ఏ క్షణమైనా మోదీ నుంచే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Advertisement

కేంద్రం చట్టాల్లోని సెక్షన్ల సవరణ గురించి ప్రజాభిప్రాయం కూడా తెలుసుకోనుందని సమాచారం.కేంద్రం న్యాయ నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా ముందడుగులు వేయడానికి సిద్ధమవుతోంది.

చట్టాల్లోని సెక్షన్ల సవరణ అంత తేలికైన అంశం కానప్పటికీ మోదీ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుందంటే ఆ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గదు.మరోవైపు మోదీ నిర్ణయానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వ్యక్తమవుతుందో చూడాల్సి ఉంది.

మోదీ సర్కార్ గతంలో నోట్ల రద్దు, జీఎస్టీ, ఆర్టికల్ 370 రద్దు లాంటి సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంది.ఈ నిర్ణయాలపై మొదట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా మోదీ ప్రజల భవిష్యత్తును, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజల నుంచి మద్దతు లభించింది.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు