మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం..మంత్రి పువ్వాడ.

వినాయక చవితికి విత్తన గణపతిని ప్రతిష్ఠించుకుందాం అని, మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడినవారం అవుతామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు.

నవరాత్రులు పూర్తయ్యాక దానిని ఇంటి పెరట్లో పాదుచేసి సంరక్షిద్దామని, చెట్టుగా ఎదిగిన గణపతిని ప్రతిరోజూ దర్శించుకుందామన్నారు.

ఆయన చల్లని నీడలో కాసేపు సేదదీరుదాం.ఇప్పుడు కావాల్సింది ఎత్తయిన విగ్రహం కాదని, విత్తయిన విగ్రహమని లోకానికి చాటి చెబుదామని వివరించారు.

పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, పచ్చదనం పెంపు నిత్యజీవితంలో భాగంకావాలని, నేటి మొక్కులే రేపటి మొక్కలను పేర్కొన్నారు.వినాయక చవితి సందర్భంగా విత్తన గణేశ ప్రతిమలను పూజించాలని పిలుపునిచ్చారు.

ఈ మేరకు ఇందుకు సంబంధించిన వీడియో ప్రచార దృశ్యాన్ని మంత్రి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.తెలంగాణకు హరితహరం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విత్తన గణేశ ప్రతిమలను పంపిణీ చేస్తామని అన్నారు.

Advertisement

స్వచ్ఛమైన మట్టి, కొబ్బరినాచుతో ప్రతిమలను తయారు చేస్తునట్టు తెలిపారు.హరిత తెలంగాణ సాధనలో భాగంగా చింత, వేప మొక్కలను విరివిగా పెంచాలన్న సీఎం కేసీఆర్‌ ఆశయం మేరకు ఆ విత్తనాలతో మట్టి గణేశులను తయారుచేసి పంపిణీ చేస్తున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు.

అలాగే పెద్ద సంఖ్యలో ఔషధ మొక్కల అవసరాన్ని గుర్తించి, వాటి విత్తనాలతో కూడా విత్త‌న గ‌ణ‌ప‌తుల‌ తయారీ, పంపిణీ కొనసాగుతుంద‌న్నారు.కాలుష్యం తద్వారా జరుగుతున్న పర్యావరణ నష్టాన్ని తగ్గించాలన్న తలంపుతో విత్తన గణపతుల పంపిణీకి చేస్తున్నామని ప్రతిఏటా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

ప్రజలు- భక్తులు వీలైనంత వరకు మట్టి ప్రతిమలను కొలిచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు నిచ్చారు.తద్వారా వాటి తయారీదారులకు ఉపాధి, పర్యావరణహితం అనే రెండు లక్ష్యాలు నెరవేరుతాయని తెలిపారు.

పచ్చదనం పెంపుతో పాటు, పర్యావరణ రక్షణకు వీలైనన్ని చర్యలు తీసుకోవటంలో ప్రతీ ఒక్కరూ తగిన అవగాహనతో వ్యవహరించాలని కోరారు.

వయనాడ్ బాధితుల విషయంలో మంచి మనస్సు చాటుకున్న విక్రమ్.. అన్ని రూ.లక్షల విరాళమంటూ?
Advertisement

Latest Press Releases News