Jupalli Krishna Rao : హరీశ్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావుకు( Former Minister Harish Rao ) మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు.

రాష్ట్రంలోని రైతుల గురించి చర్చించడానికి సిద్ధమా అని హరీశ్ రావుకు ఛాలెంజ్ చేశారు.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎప్పుడైనా పంట నష్టం ఇచ్చిందా అని జూపల్లి ప్రశ్నించారు.త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో లబ్ధి పొందడం కోసమే హరీశ్ రావు అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సుమారు ఆరు వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మంత్రి జూపల్లి తెలిపారు.రాయలసీమకు నీళ్లు తరలిస్తుంటే గుడ్లు అప్పగించి చూశారని విమర్శించారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు