దళిత వైతాళికుడు ఎం. భాగ్యరెడ్డి వర్మ: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: దళితుల అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించిన మహనీయులు ఎం.

భాగ్యరెడ్డి వర్మ అని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన ఎం.భాగ్యరెడ్డి వర్మ 135 జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ అంటరానితనం,కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతూ ఆది హిందు ఉద్యమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.దళితుల విద్యాబుద్ధులు నేర్పడం అలాగే వారిలో చైతన్యం తేవడం కోసం జగన్ మిత్ర మండలిని 1906 లో స్థాపించి మండలి ద్వారా ఎనలేని సేవలు అందించడం జరిగిందని అన్నారు.

ముఖ్యంగా ఆర్య సమాజానికి వారి అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించడం వలన వర్మ అనే బిరుదు పొందడం జరిగిందన్నారు.గత పాలకులు తెలంగాణ మహనీయులు గుర్తించక పోవడం రాష్ట్రం సాదించుకున్నాక వారి జయంతులు,వరదంతుల వేడుకలు ప్రభుత్వమే నిర్వహిస్తోందన్నారు.

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్నదని జిల్లాలో దళిత బంధు పథకం దళిత కుటుంబాలలో గొప్ప వెలుగు నింపి ఆర్ధిక బలోపేతానికి ఎంతో దోహద పడుతుందని స్పష్టం చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని,ఆదిశగా జిల్లాలో అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనవు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్,మున్సిపల్ చైర్మన్ పి.అన్నపూర్ణ,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్,జెడ్పిటిసి జీడీ భిక్షం,మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్,జిల్లా అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రైతు భరోసా పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ
Advertisement

Latest Suryapet News