సిరిసిల్లలో ప్రత్యేక ఆకర్షణగా మిల్లెట్ గణేశుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్( International Year of millets ) సంవత్సరం గా ప్రకటించిన నేపథ్యంలో మిల్లెట్ ల ప్రాముఖ్యత , ఆరోగ్య పరిరక్షణలో వాటి ప్రాధాన్యతను గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి సిరిసిల్ల పట్టణంలోని హిమాన్షి చిల్డ్రన్స్ హాస్పిటల్‌ లో ఆసుపత్రి నిర్వాహకులు మిల్లెట్ ( చిరు , తృణ ధాన్యాలు) లతో చేసిన గణేశుడిని ప్రతిష్టించారు.5 అడుగుల పరిమాణం గలపర్యావరణ అనుకూల చిరుధాన్యగణపతి(మిల్లెట్) గణేశుడి ప్రతిమ( Ganesha Statue ) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకిస్తున్నారు.

నిమజ్జనం పూర్తి అయ్యేంత వరకూ మిల్లెట్‌తో చేసిన వివిధ వంటకాలు 9 రోజుల పాటు రోజువారీ భక్తులకు ప్రసాదంగా అందించనున్నారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

Latest Rajanna Sircilla News