గ్యాంగ్ లీడర్ వర్సెస్ వాల్తేరు వీరయ్య.. మెగా పిక్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

గాడ్ ఫాదర్ వంటి రీమేక్ సినిమా తర్వాత మెగాస్టార్ నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే చాలా అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.2023 జనవరి 13న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది.ఇక ఇదిలా తాజాగా మెగాస్టార్ ఫ్యాన్స్ ఈ సినిమాలోని ఒక పిక్ ను వైరల్ చేసేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య నుండి ఈ మధ్యనే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి బాగా ఆకట్టు కుంటున్నాయి.

Megastar Chiranjeevi Latest Picture Trending On Social Media Details, Waltair Ve
Advertisement
Megastar Chiranjeevi Latest Picture Trending On Social Media Details, Waltair Ve

ఇక ఈ సినిమా టైటిల్ సాంగ్ అయిన మూడవ సాంగ్ ను డిసెంబర్ 26న అంటే రేపు రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.కాగా మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించగా ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరుకు సంబంధించిన మరో మాస్ లుక్ రివీల్ చేసారు.మెగాస్టార్ చేతిలో ఫైర్ పట్టుకుని ఉన్న ఈ పోస్టర్ నిన్నటి నుండి నెట్టింట వైరల్ అవుతుంది.

మరి ఇదే మాదిరి పిక్ గతంలో మెగాస్టార్ నటించిన గ్యాంగ్ లీడర్ విడుదల సమయంలో కూడా వచ్చింది.దీంతో ఈ రెండు ఫోటోలను కంపేర్ చేస్తూ ఎడిట్ చేసి పిక్ వైరల్ చేస్తున్నారు.

మెగాస్టార్ కు టైం గ్యాప్ మాత్రమే వచ్చిందని.టైమింగ్ లో గ్యాప్ రాలేదని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు