నేను వాంతి చేసుకుంటే బాబాయ్ ఆ పని చేశాడు.. చెర్రీ కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ అగ్ర హీరో బాలయ్య బాబు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఈ షో విశేష ప్రేక్షకులను దక్కించుకుంది.

కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాకుండా డైరెక్టర్లు రాజకీయ నాయకులను సైతం బాలయ్య బాబు తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేశారు.సరదాగా నవ్విస్తూనే కాంట్రవర్సీ ప్రశ్నలకు కూడా సరదాగానే సమాధానం వచ్చేలా చేశారు బాలయ్య బాబు.

కాగా ఈ షో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ప్రభాస్ ఎపిసోడ్ ప్రసారం అయినప్పుడు సర్వర్లు క్రాష్ అయ్యాయి అంటే ఆ షోకి ఏ రేంజ్ లో ప్రేక్షకాధరణ దక్కిందో అర్థం చేసుకోవచ్చు.

Megapower Star Ram Charan Reveals Emotional Incident With Balayya Pawan Kalyan,

ఇక ప్రభాస్ ఎపిసోడ్ ఒక రేంజ్ అనుకుంటే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వేరే రేంజ్ అని చెప్పవచ్చు.ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు ప్రసారమవుతుందా అని ఎంతగానో ఎదురు చూశారు.ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రసారమయ్యింది.

Advertisement
Megapower Star Ram Charan Reveals Emotional Incident With Balayya Pawan Kalyan,

ఈ షోలో పవన్ కళ్యాణ్ ఎన్నో విషయాలను పంచుకున్నారు.ఇకపోతే బాలయ్య బాబు షోలో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి అడగడం కోసం రామ్ చరణ్ కి ఫోన్ చేశారు.

ఇప్పుడు బాలయ్య బాబు రామ్ చరణ్ తో మాట్లాడుతూ మీ నాన్న దగ్గర లేనప్పుడు మీ బాబాయితో జరిగిన ఒక పెద్ద సీక్రెట్ ఏంటి అని ప్రశ్నించారు.అప్పుడు రామ్ చరణ్ మాట్లాడుతూ.

నాకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు బాబాయ్ తో కలిసి సింగపూర్ కి వెళ్లాను.

Megapower Star Ram Charan Reveals Emotional Incident With Balayya Pawan Kalyan,

అప్పుడు దగ్గర అమ్మ నాన్న ఎవరూ లేరు.దాంతో కళ్యాణ్ బాబాయ్ తో కలిసి పిజ్జాలు బర్గర్లు ఇష్టం వచ్చినట్టు తినేసాను.కానీ ఒకచోట అవి తేడా కొట్టడంతో విపరీతంగా వాంతులు చేసుకున్నాను.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

అప్పుడు కళ్యాణ్ బాబాయ్ నేను వాంతులు చేసుకున్న దానిని తన చేతులతో పట్టుకొని క్లీన్ చేశాడు అంటూ సీక్రెట్ రివీల్ చేశాడు రామ్ చరణ్.అయితే ఎప్పుడు సినిమాలు రాజకీయాలు అంటూ కాస్త సీరియస్ గా కనిపించే పవన్ కళ్యాణ్ బాలయ్య బాబు షోలో మాత్రం ఎంతో యాక్టివ్ గా నవ్వుతూ కనిపించాడు.

Advertisement

తాజా వార్తలు