అగ్రరాజ్యం లో మరో సారి పేలిన తూటా, 20 మంది మృతి

అగరాజ్యం అమెరికా లో మరోసారి తుపాకీ తూటా పేలింది.టెక్సాస్ లోని వాల్ మార్ట్ స్టోర్ లో ఈ కాల్పుల కలకలం చోటుచేసుకుంది.

ఎవరో ఆగంతకులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడడం తో దాదాపు 20 మంది మృతి చెందగా,మరో 26 మంది గాయపడినట్లు తెలుస్తుంది.అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి ని మాత్రం అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

అక్కడి పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి 21 ఏళ్ల శ్వేత జాతీయుడు లొంగిపోయినట్లు తెలిపారు.ఐతే ఇది ద్వేషపూరిత దాడి గా అనుమానిస్తున్నారు అక్కడి అధికారులు.

ప్రస్తుతం దుండగుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.అసలు ఈ కాల్పుల వెనుక ఉన్న అసలు కారణాలు వెతికే పనిలో పడ్డారు అధికారులు.

Advertisement

ప్రతి వారాంతంలో వాల్ మార్ట్ కు వచ్చే సంఖ్య ఎక్కువగా ఉంటుంది.శనివారం కావడం తో చాలా మంది వాల్ మార్ట్ లో షాపింగ్ కోసం రాగా దానిని అదునుగా చూసుకొని ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.

దుండగుల కాల్పుల్లో 20 మంది మృతి చెందగా,పలువురు గాయపడడం తో వారందరినీ అధికారులు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.అసలు ఈ ఘటన జాత్యహంకార దాడా లేక ఉగ్రవాద చర్య అన్న విషయం పై అధికారులు ఆరా తీస్తున్నారు.

గత కొంత కాలంగా అమెరికా లో తుపాకీ తూటాలు పేలుతూనే ఉన్నాయ్.గడచిన వారం రోజుల వ్యవధిలో ఇలా వాల్ మార్ట్ స్టోర్ లో ఈ విధంగా కాల్పుల ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి.

ఇలా వరుస దాడులు చోటుచేసుకుంటుండడం తో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇంకా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు