Manchu Lakshmi : మంచు లక్ష్మి విషయంలో గర్వపడుతున్నానన్న మనోజ్.. ఇది చాలా గొప్ప నిర్ణయమంటూ?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ నటి మంచు లక్ష్మి( Manchu Lakshmi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విలక్షన నటుడు మోహన్ బాబు కూతురిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Manchu Manoj Post Manchu Lakshmi School Adaptation-TeluguStop.com

అలాగే బుల్లితెర పై పలు షోలకు హోస్ట్ గా వ్యవహారించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.ఇకపోతే తరచుగా సోషల్ మీడియాలో నిలిచే వారిలో మంచు లక్ష్మి కూడా ఒకరు.

ఈమె తరచూ ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది.

అలాగే మంచు ఫ్యామిలీలో( Manchu family ) ఎక్కువగా ట్రోలింగ్స్ ని ఎదుర్కొనే వారిలో మంచు లక్ష్మి కూడా ఒకరు అని చెప్పవచ్చు.తనపై ఎవరు ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసినా మంచు లక్ష్మి అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది.తనకు తన కూతురికి అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది.

కొందరు ప్రేక్షకులు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేయగా మరి కొందరు మాత్రం ఆమెపై రోల్స్ చేస్తూ నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ ఉంటారు.ఇది ఇలా ఉంటే మంచు మనోజ్( Manchu Manoj ) తన అక్క మంచు లక్ష్మిపై పొగడ్తల వర్షం కురిపించాడు.

అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది పిల్లలు సరైన చదువు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయమై దృష్టి సారించిన మంచు లక్ష‍్మీ.టీచ్ ఫర్ ఛేంజ్( Teach for Change ) కార్యక్రమంలో భాగంగా స్కూల్స్ ని దత్తత తీసుకుంటోంది.గతేడాది యాదాద్రి జిల్లాలో 56 పాఠశాలలని దత్తత తీసుకుంది.

ఆయా స్కూల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయి.అలా ఇటీవలె రెండు వారాల ముందు గద్వాల్ జిల్లాలోని 30 పాఠశాలల్ని ఈమె దత్తత తీసుకుంది.

అయితే కొద్ది రోజు ముందు మంచు లక్ష‍్మీ చేసిన ఈ మంచి పని గురించి ఆమె తమ‍్ముడు ఇన్ స్టాలో ఇ‍ప్పుడు పోస్ట్ పెట్టాడు.మా అక్కని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.

జోగులాంబ గద్వాల్ జిల్లాలో 30 స్కూల్స్ ని దత్తత తీసుకుంది.ఇది చాలా గొప్ప నిర్ణయం.

ఈ విషయమై సహాయం చేసిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు అని మంచు మనోజ్ రాసుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube