మానాల కోమటికుంట చెరువుకు గండి...

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) రుద్రంగి మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు( Heavy rains ) మానాలలోని కోమటికుంట చెరువు కట్టకు గండిపడడంతో పెద్ద ఎత్తున నీరువృథాగా పోతోంది.

సోమవారం రోజున ఎంపీడీవో శంకర్,వైస్ఎంపీపీ పిసరి భూమయ్యతో కలిసి చెరువుకట్టను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తాత్కాలిక మరమ్మతులు చేపడతామన్నారు.గ్రామస్తులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎవరినైనా ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు.వీరి వెంట పీఆర్ ఏఈ మనోహర్( Manohar ),పంచాయతీ కార్యదర్శి బాబు తదితరులు ఉన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News