చెట్టును నరికాడు -హరితహారంలో నాటుడు బిల్డింగ్ ఓనరు నరుకుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా: పచ్చని చెట్లను నరుకుతున్నారు.

చెట్లను నరికితే జరిమాన విధించడం జరుగుతుందని తెలిసిన నరకడం మానడం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం లో భాగంగా నాటిన చెట్లను బిల్డింగ్ కు అడ్డుగా ఉన్నాయని యజమానులు నరుకుతున్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిని ఆనుకొని రాజన్నపేట గ్రామానికి చెందిన శంకర్ బిల్డింగ్ కాంప్లెక్స్ ను నిర్మించాడు.తన ఇంటి ముందు ఉన్న చెట్టు మొదలును బుధవారం నిర్దాక్షిణ్యంగా నరికి పారేశాడు.

శంకర్ ను వివరణ కోరగా పక్షం రోజుల క్రితం గ్రామపంచాయతీ సిబ్బంది మండలను కొట్టివేయడం జరిగిందని చెట్టు మొదలు మాత్రమే ఉండగా దానిని తొలగించడం జరిగిందని నా తప్పు ఎలాంటిది లేదని అన్నారు.గతంలో దాని ప్రక్కనే ఉన్న బిల్డింగ్ ఓనర్ పచ్చని చెట్టును నరు కదా అతనికి గ్రామపంచాయతీ కార్యదర్శి జరిమాన కూడా విధించడం జరిగింది.

చెట్లను నరికే వారిని కఠినంగా శిక్షించాలని హరిత ప్రేమికులు కోరుతున్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News