పాతికేళ్లకే జీవితం అయిపోదు.. గాసిప్స్ పై ఘాటుగా స్పందించిన మలైకా అరోరా!

బాలీవుడ్ లవ్ బర్డ్స్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం అందరికి తెలిసిందే.

అయితే ఈ జంట ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం మలైకా కు 48 ఏళ్ల వయసు కాగా, అర్జున్ కపూర్ వయస్సు 36.అంటే దాదాపుగా వీరి మధ్య పన్నెండేళ్ల వ్యత్యాసం ఉంది.ఇక ఈ జంట ఏజ్ యాప్ గురించి సోషల్ మీడియాలో తరచుగా ట్రోలింగ్స్ జరుగుతూ ఉంటాయి.

అయినా కూడా ఈ జంట ఎప్పుడూ ఆ విషయంపై స్పందించలేదు.ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా అర్జున్ కపూర్, మలైకా అరోరా విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

వీరి నాలుగేళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున రూమర్లు వినిపించాయి.అయితే వీరిద్దరి ఏజ్ గ్యాప్ విషయంలో వస్తున్న రూమర్స్ పై ఇటీవలే అర్జున్ కపూర్ ఇంటర్వ్యూ లో భాగంగా వారి విషయాలపై వస్తున్న విమర్శలకు కాస్త ఘాటుగా స్పందించాడు.

Advertisement
Malaika Arora Shares Note Normalizing Finding Love 40s Malaika Arora, Arjun Kapo

ఇదిలా ఉంటే తాజాగా మలైకా అరోరా స్పందించింది.వారి విషయంపై వస్తున్న రూమర్లను ఖండిస్తూ అలాంటి రూమర్స్ కి చెక్ పెడుతూ తాజాగా ఒక ఫోటోని విడుదల చేసింది.

Malaika Arora Shares Note Normalizing Finding Love 40s Malaika Arora, Arjun Kapo

మలైకా వారి రిలేషన్షిప్ పై స్పందిస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది.40 ఏళ్ల వయసులో ప్రేమలో పడటం సాధారణ విషయంగా భావించండి.మీ 30 ఏళ్ల వయసులో కొత్త కలలను కనుగొని సాధించడాన్ని అంగీకరించండి.50 ఏళ్ల వయసులో మిమ్మల్ని మీ లక్ష్యాన్ని గుర్తించడానికి అంగీకరించండి.జీవితం 20 ఏళ్లను దాటేసింది.25 ఏళ్ల తో జీవితం ముగియదు.అలా నటించడం మానేద్దాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మలైకా అరోరా.

ఈ విధంగా వారి బంధం పై వస్తున్న రూమర్లకు కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చింది.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు