మహిళా బంధు మన కేసీఆర్ గారు - ఎమ్మెల్సీ కవిత

కళ్యాణ లక్ష్మి లబ్ధిదారురాలి ఇంటికి వెళ్లి భోజనం చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్గౌరీశంకర్ కాలనీలోని లబ్ధిదారురాలు శైలజ ఇంటికి వెళ్లి పలకరించిన ఎమ్మెల్సీ కవిత.వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్సి కవిత.

నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ రూ.2,750 కోట్లు కేటాయించడం మనందరికి గర్వకారణం.పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ అని అన్నారు ఎమ్మెల్సీ కవిత.

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గారి పిలుపు మేరకు మహిళా దినోత్సవ సంబరాల్లో భాగంగా ఈరోజు లబ్ధిదారులు ఇంటికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత వారితో కలిసి భోజనం చేశారు.అనంతరం వారితో ముచ్చటించారు.

గౌరీశంకర్ కాలనీ కి విచ్చేసిన ఎమ్మెల్సీ కవిత గారికి కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని, ఆడపిల్లల తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరంగా మారాయన్నారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలతో బాల్య వివాహాలు తగ్గాయన్నారు.

తెలంగాణాలో ఏ ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళి జరిగిన ప్రభుత్వ సహకారం ఉండాలని, ముఖ్యమంత్రి కెసిఆర్ కల్యాణలక్ష్మి షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకం, షాదీముబారక్ ద్వారా నిరుపేద కుటుంబీకులు ఎంతో లబ్ది పొందుతున్నారు.ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలిచి రూ.1,00,116/ అందజేస్తున్నారన్నారు.నిరు పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ మేనమామ లాగా ఆడ పిల్లల పెళ్లి కి డబ్బులు అందించడం సంతోష దగ్గ విషయమన్నారుఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నే కవిత రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

తాజా వార్తలు