పవన్ కళ్యాణ్ వళ్ల అగిపోతున్న మహేష్ బాబు సినిమా...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్( Trivikram ) గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు చూస్తే మనకా అర్థం అవుతుంది.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) త్రివిక్రమ్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా గురించి మనకు తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడిందన్నది ఆ షాకింగ్ గ్యాసిప్.

ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఏదో సమస్య వస్తూనే వుంది.ముందుగా హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్ దగ్గర సమస్య వచ్చింది.

ఆఖరికి త్రివిక్రమ్ ఏదో విధంగా సర్దుబాటు చేసారు.ఆ తరువాత షూట్ స్టార్ట్ చేసారు.

కేజిఎఫ్ ఫైట్ మాస్టర్లను తీసుకువచ్చారు.షూట్ చేసారు.

Advertisement

కానీ హీరోకి వాళ్ల పని నచ్చలేదు.దాంతో షూట్ చేసినదంతా పక్కన పడేసారు.

ఫైట్ మాస్టర్లను మార్చారు.దీని వల్ల అయిదు కోట్ల వరకు సినిమా మీద భారం పడిందని టాక్.

ఆ తరువాత కూడా షూటింగ్ ఏమీ పెద్ద హుషారుగా సాగలేదు.ఇప్పటికి మహా అయితే 20 పర్సంట్ ఫుటేజ్ వచ్చి వుంటుందని టాక్.

లేటెస్ట్ గా మహేష్ బాబు విదేశాలకు వెళ్లి వచ్చారు.షూటింగ్ మొదలు కావాల్సి వుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

ఇలాంటి టైమ్ లో దర్శకుడు త్రివిక్రమ్ వచ్చి మహేష్ బాబు కు షాకింగ్ విషయం చెప్పినట్లు తెలుస్తోంది.ఇటీవల ఓ మాల్ లో చేసిన హీరో, హీరోయిన్ శ్రీలీల( Srileela ) కాంబో సీన్లు మొత్తం స్క్రాప్ చేస్తున్నట్లు త్రివిక్రమ్ చెప్పారన్నది వినిపిస్తున్న గ్యాసిప్.

Advertisement

తనకు సంతృప్తిగా రాలేదని త్రివిక్రమ్ చెప్పడంతో హీరో కాస్త చికాకు పడినట్లు బోగట్టా.అసలు పెర్ ఫెక్ట్ గా షెడ్యూలు వేసుకుని వస్తే షూట్ కు వెళ్లడానికి తాను రెడీ అని, ఇలా ఓ అడుగు ముందుకు, ఓ అడుగు వెనక్కు అన్నది సరి కాదని కరాఖండీగా చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే కేవలం మాల్ లో చేసిన షూట్ ఫుటేజ్ నే స్క్రాప్ చేస్తున్నారా? లేక మొత్తం ఇప్పటి వరకు చేసినది అంతా తీసేస్తారా? అన్నది క్లారిటీ లేదు.త్రివిక్రమ్ వేరే పనుల మీద దృష్టి పెట్టి, మహేష్ సినిమా మీద సరిగ్గా దృష్టి పెట్టడం లేదనే విమర్శ ఒకటి వుంది.పవన్ కళ్యాణ్-పీపుల్స్ మీడియా సినిమా వ్యవహారాల ఫైనల్ డెసిషన్లు అన్నీ త్రివిక్రమ్ చేతుల మీదగానే జరుగుతున్నాయని టాక్ వుంది.

అలాగే పవన్ ( Pawan Kalyan ) మరో సినిమా ఓజి పనులు, ఫైనల్ డెసిషన్లు అన్నీ త్రివిక్రమ్ వే అని మరో టాక్ వుంది.ఎన్టీఆర్ తో అడ్వర్ టైజ్ మెంట్ పనులు వున్నాయి.

మహేష్ బాబు సినిమా తరువాత బన్నీ సినిమా వుంది.ఇవన్నీ కలిసి మహేష్ సినిమా మీద సరైన దృష్టి పెట్టలేకపోతున్నారేమో అని ఫ్యాన్స్ ఆవేదన.

మహేష్ బాబు ఈ సినిమా మీద, దాని క్వాలిటీ మీద పూర్తిగా పట్టుదలగా వున్నారు.అస్సలు రాజీపడడం లేదు.త్రివిక్రమ్ కు ఏదీ అంత సులువుగా వదిలేయడం లేదు.

దీని తరువాత రాజమౌళి సినిమా వుండడంతో, మహేష్ వీలయినంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలనుకుంటున్నారు.కానీ ఇలా బ్రేక్ లు పడుతున్నాయి.పైగా మహేష్ ఏదో ఊళ్లు తిరుగుతున్నారు, ఎండలకు భయపడుతున్నారు అంటూ బయటకు ఫీలర్లు వస్తుంటే మరింత ఫీలవుతున్నారు.

తాను సినిమా చేయడానికి రెడీగా వుంటే, త్రివిక్రమ్ కారణంగా అంతా వెనక్కు వెళ్తుంటే, తిరిగి తనను ఇలా బదనామ్ చేయడం ఏమిటి అని మహేష్ ఫీలవుతున్నారని తెలుస్తోంది.మొత్తానికి మహేష్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఏదో జరుగుతోంది.ఇదిలా వుంటే ఈ మొత్తం వ్యవహారం మీద సినిమా కీలక బాధ్యుడు సూర్యదేవర నాగవంశీని ప్రశ్నించగా, ఇవన్నీ గ్యాసిప్ లు తప్ప వేరు కాదని, మాల్ లో తీసినవి కామెడీ సీన్లు అని, అవన్నీ బాగా వచ్చాయని, ఎందుకు స్క్రాప్ చేస్తామని ప్రశ్నించారు.

త్వరలో తరువాత షెడ్యూలు ప్రారంభం అవుతుందన్నారు.

తాజా వార్తలు