సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) హీరోగా నటించిన తాజా చిత్రం ఏజెంట్.ఈ మూవీ ఏప్రిల్ 28 న గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా అఖిల్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమైన విషయం తెలిసిందే.అంతేకాకుండా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా చిత్ర బృందం ఒక షాకింగ్ సర్ప్రైజ్ ను ఇచ్చారు.

అదేమిటంటే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక గెస్ట్ రోల్ లో నటించారు.ఈ మేరకు తాజాగా రామ్ చరణ్ కి సంబంధించిన చిన్న టీజర్ ను విడుదల చేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ టీజర్ లో ఏజెంట్ ని ధృవ మీట్ అవబోతున్నట్లు చూపించారు.టీజర్ లో పవర్ ఫుల్ గా ధృవ( Dhruva ) బిజియం వస్తుంది.వెనుక నుంచి చరణ్( Ram charan ) ని చూపించారు.చివర్లో ఏజెంట్ ఎక్కడున్నావు అంటూ చెర్రీ పవర్ ఫుల్ వాయిస్ వినిపిస్తోంది.తాజాగా అందుకు సంబంధించిన టీజర్ వీడియోని అఖిల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు.

ఈ టీజర్ కి ధృవ X ఏజెంట్( Surender Reddy ) పరిస్థితులు మరింత వైల్డ్ గా మారుతున్నాయి అనే క్యాప్షన్ ని కూడా రాసుకొచ్చారు అఖిల్.రామ్ చరణ్ నటించిన దుర్వా సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇప్పటికే అక్కినేని అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుండగా తాజాగా చెర్రీకి సంబంధించిన వీడియోని విడుదల చేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
చెర్రీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో అఖిల్ పూర్తిగా జుట్టు పెంచుకొని సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించిన సంగతి తెలిసిందే.







