మహేష్ తో పోల్చితే నాగార్జున ముందే ఉన్నాడు!

సూపర్ స్టార్‌ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబో లో రూపొందుతున్న గుంటూరు కారం( Guntur Karam ) సినిమా ను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.ఇంకా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవ్వలేదు.

 Mahesh Babu Gunturu Karam Vs Nagarjuna Naa Saami Ranga Movie Details, Mahesh Bab-TeluguStop.com

ఒక్క పాట మాత్రమే విడుదల అయింది.టీజర్ కూడా ప్రత్యేకంగా విడుదల చేయలేదు.

కేరళ షెడ్యూల్‌ షూటింగ్ ని ముగించాల్సి ఉంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఇక మహేష్ బాబు( Mahesh Babu ) ఫ్యాన్స్ అసలు ఈ సినిమా సంక్రాంతికి విడుదల అయ్యేనా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కాని నిర్మాత నాగ వంశీ మాత్రం సినిమా ను కచ్చితంగా సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెల్సిందే.

Telugu Trivikram, Gunturkaram, Gunturu Karam, Mahesh Babu, Naa Saami Ranga, Naga

మరో వైపు సంక్రాంతి సందర్భంగా రాబోతున్న మరో సినిమా నాగార్జున( Nagarjuna ) నటిస్తున్న నా సామి రంగ.( Naa Saami Ranga ) ఈ సినిమా కు విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నాడు.ఆ సినిమా షూటింగ్‌ రెండు మూడు రోజుల్లో పూర్తి అవ్వబోతుందని సమాచారం అందుతోంది.

మరో వైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ అయ్యాయి.ఇటీవలే సినిమా కు సంబంధించిన హీరోయిన్ పరిచయం మరియు పాట ను కూడా రివీల్‌ చేయడం జరిగింది.

దాంతో సినిమా పై ఆసక్తి అంచనాలు పెరుగుతున్నాయి.

Telugu Trivikram, Gunturkaram, Gunturu Karam, Mahesh Babu, Naa Saami Ranga, Naga

ఇదే సమయంలో గుంటూరు కారం గురించి ఉన్న ఆసక్తి తగ్గుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి గుంటూరు కారం సినిమా తో పోల్చితే అదే సంక్రాంతికి( Sankranti ) బరి లో దిగబోతున్న నా సామి రంగ సినిమా ఒక అడుగు ముందే ఉన్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మహేష్ బాబు మరియు నాగార్జున సినిమా లతో పాటు ఇంకా కొన్ని సినిమా లు కూడా సంక్రాంతికి రాబోతున్న విషయం తెల్సిందే.

ఈ సంక్రాంతికి ఆడియన్స్ కి వినోదాల విందు ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube