మహాత్మ గాంధీజీ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం..జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: జాతిపిత మహాత్మా గాంధీజి జయంతి( Gandhi Jayanti ) సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ చిత్రపటానికి పోలీస్ అధికారులు,సిబ్బందితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సత్యం, అహింస సత్యాగ్రహం అనే మూడు ఆయుధాలతో బ్రిటిష్ వారిపై పోరాటం చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప యోధుడు గాంధీజీ .

ఆయన సూచించిన శాంతి, అహింస, సత్యం మార్గంలో ముందుకు సాగుతూ ఆయన నమ్మిన సిద్ధాంతాలను విలువలను నిబద్ధతతో ఆచరిస్తూ గాంధీజీ కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేయాలన్నారు.నేటి యువతరం గాంధీజీ జీవన మార్గాన్ని అనుసరిస్తూ దేశ అభివృద్ధి కోసం నిస్వార్థంగా సేవలు అందించాలని కోరారు.

గాంధీజీ లాంటి గొప్ప నాయకున్నీ ఆదర్శంగా తీసుకుని కష్టపడే తత్వం అలవర్చుకోవాలని ప్రజలకు సేవ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మురళి కృష్ణ( DSP Murali Krishna ),సి.

ఐ శ్రీనివాస్, ఆర్.ఐ లు మధుకర్, యాదగిరి, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
హనుమాన్ భజన చేసి నిరసన తెలిపిన సిరిసిల్ల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు

Latest Rajanna Sircilla News