ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను.. మాధవన్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు మాధవన్( Madhavn ) తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో మాధవన్ చాలా తక్కువ సినిమాలను చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈయన చివరిగా నంబి నారాయణ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా ఆ సినిమాలో నంబి నారాయణ పాత్రలో నటించి మెప్పించారు.తాజాగా మరొక వెబ్ సిరీస్ ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Madhvan Recalls He Wanted Marry Juhi Chawla, Madhvan, Juhi Chawla, The Railway

మాధవన్ ద రైల్వే మెన్( The Railway Man ) అనే వెబ్ సిరీస్ లో నటించారు.ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి మాధవన్ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

ఇక ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటి జుహీ చావ్లా ( Juhi Chawla) కూడా నటించారు.అయితే ఈమె గురించి ఈయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Madhvan Recalls He Wanted Marry Juhi Chawla, Madhvan, Juhi Chawla, The Railway
Advertisement
Madhvan Recalls He Wanted Marry Juhi Chawla, Madhvan, Juhi Chawla, The Railway

ఈ వెబ్ సిరీస్ లో నాకు సంబంధించి కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఇందులో జుహీ చావ్లా బాగమయ్యారని ఈయన తెలియజేశారు.అయితే ఈమె 1988 లో నటించిన ఖయామత్ సే ఖయామత్ టక్( Qayamat Se Qayamat Tak ) సినిమా చూసి ఆమెకు ఫిదా అయ్యానని ఆ క్షణమే తనని పెళ్లి చేసుకోవాలి అనిపించిందని ఈయన తెలియజేశారు ఇలా ఈ విషయం మా అమ్మగారితో కూడా తాను చెప్పానని ఈ సందర్భంగా మాధవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు