అవమానాలు, ముఖంపై ఆహారం పారేసే సిబ్బంది, ప్రాథమిక సౌకర్యాలు బొత్తిగా లేని హోటల్‌కు ఎవరైనా వెళ్తారా? ఊహించుకోవడానికి ఇది ఒక పీడకల లాగా ఉంది, కదా? సరే, లండన్‌లోని( London ) బార్నెట్‌లోని కరెన్స్ హోటల్‌లో( Karen’s Hotel ) సరిగ్గా ఇదే జరుగుతుంది.ఇలాంటి అవమానకరమైన అనుభూతిని పొందడానికి ప్రజలు కూడా వెళ్తుంటారు.పైగా ఈ హోటల్లో ఉండటానికి అక్షరాలా రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది.
నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం.ఉద్దేశపూర్వకంగా అనాగరికమైన సేవకు ప్రసిద్ధి చెందిన ఈ కరెన్స్ హోటల్ ఇప్పుడు చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది.ఇందులో ఖరీదైన పడకలు, మెత్తటి తువ్వాళ్లు లేదా మంచి భోజనం ఆస్వాదించొచ్చని అనుకుంటే పొరపాటే.ఇందులో బేసిక్ సౌకర్యాలు కూడా ఉండవు.
ఉన్న కొన్ని సౌకర్యాలు అత్యంత భయంకరంగా ఉంటాయి.
హోటల్ తనను తాను “ప్రపంచంలోని చెత్త హోటల్”( Worst Hotel In The World ) అని గర్వంగా చెప్పుకుంటుంది.నిజం చెప్పాలంటే ఈ హోటల్ ఆ టైటిల్‌కు అనుగుణంగా చెత్తగా ఉంటుంది.చెల్లాచెదురుగా ఉన్న ఫర్నీచర్‌తో కూడిన మురికి గదులు, ప్రాథమిక పరిశుభ్రత ప్రమాణాలు లేని అపార్ట్‌మెంట్స్ ఇందులో దర్శనమిస్తుంటాయి.
ఈ హోటల్ లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ పనిచేసే ఉద్యోగులు అవమానకరమైన మాటలు మాట్లాడతారు.
అయితే సరదాగా మాత్రమే అవమానిస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చే కస్టమర్లు( Customers ) తిట్లను జోకులుగా భావించి నవ్వుకుంటారు.అధిక మొరటుతనం, సౌకర్యాల లేమి అన్నీ ఈ హోటల్ నిబంధనలలో భాగమే.ఇది ఒక డ్రామా లాగా అనిపిస్తుందని కస్టమర్లు చెబుతుంటారు.
ఇటీవల, కరెన్స్ హోటల్‌ను చూపించే ఓ వీడియో వైరల్‌గా కూడా మారింది.ఇందులో ఒక వెయిటర్ కస్టమర్‌పై ఆహారాన్ని విసిరింది.
దీన్ని చూసే చాలామంది షాక్ అవుతారు 20000 డాలర్లు ఈ చెత్త సర్వీస్ కోసం ఎవరు ఖర్చు చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.ఏది ఏమైనా ఈ హోటల్ ఓనర్ తెలివి సూపర్ అంటూ మరికొందరు పేర్కొంటున్నారు.