చినబాబు సవాల్ ! మీకు దమ్ముంటే ..?

ట్విట్టర్ పిట్టగా రాజకీయ ప్రత్యర్థుల నుంచి, సోషల్ మీడియా నుంచి ఆరోపణలు ఎదుర్కుంటూ వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు తనయుడు లోకేష్ ఈ మధ్య కాలంలో కాస్త మెరుగయినట్టు కనిపిస్తున్నాడు.

తమ రాజకీయ ప్రత్యర్థుల మీద తరచు విమర్శలు చేస్తూ నిత్యం ఏదో ఒక ఇష్యూ మీద ఏదో ఒక ప్రాంతం లో పర్యటిస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే తనమీద ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులకు లోకేష్ బహిరంగ సవాల్ కూడా విసిరారు.లోకేష్ కు బ్లూ ఫ్రాగ్ కంపెనీతో సత్సంబంధాలు ఉన్నాయని వైసీపీ నేతలు ఈ మధ్య కాలంలో తరచుగా విమర్శలు చేస్తున్నారు.

Lokesh Throws Challenge To Ycp Leaders-చినబాబు సవాల్ �

దీనిపై లోకేష్ స్పందించారు.బ్లూఫ్రాగ్‌ కంపెనీతో తనకు సంబంధం ఉందని, దొంగచాటు ప్రచారం కాదని దమ్ముంటే దానిని నిరూపించి అప్పుడు మాట్లాడాలని లోకేష్ సవాల్ విసిరారు.

గతంలో అనేక ఆరోపణలు చేశారని, నిరూపించమంటే పారిపోయారని హేళన చేశారు.బ్లూ ఫ్రాగ్ కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు ఆ కంపెనీతో సంబంధం ఉన్నట్లు.

Advertisement

అసత్య వార్తలు సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా లోకేష్ చెప్పారు.వైసీపీ ప్రభుత్వం చేతకానిదని అందుకే వారి అసమర్థత బయటకి కనిపించకుండా ప్రజల ద్రుష్టి మళ్లించేందుకు ప్రతిపక్షాల మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.

మంచు ఫ్యామిలీ జరుగుతున్న గొడవలు కన్నప్ప మీద ఎఫెక్ట్ చూపిస్తాయా..?
Advertisement

తాజా వార్తలు