అనారోగ్యంతో బాధపడుతున్న బిఆర్ఎస్ కార్యకర్తకు తాజా మాజీ జెడ్పిటిసి ఆర్థిక సహాయం

అనారోగ్యంతో బాధపడుతున్న బిఆర్ఎస్ కార్యకర్తకు తాజా మాజీ జెడ్పిటిసి ఆర్థిక సహాయం కష్టకాలంలో కార్యకర్తలకు తన వంతు ఆర్థిక సహాయం అందిస్తున్న తాజా మాజి జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు 5000 రూపాయలు, గుండారపు కృష్ణారెడ్డి 2000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న బిఆర్ఎస్ కార్యకర్త షేక్ జులేఖకు తాజా మాజి జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఆర్థిక సాయం అందించారు,షేక్ జులేఖ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు దృష్టికి రాగా.

నేడు బొప్పాపూర్ డబుల్ బెడ్ రూమ్ లో నివసిస్తున్న జులేఖ నివాసానికి బిఆర్ఎస్ కార్యకర్తలతో చేరుకుని ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ప్రస్తుతం ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించి, మెరుగైన వైద్యం కోసం స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ తో మాట్లాడి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి 2000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్లు కొండ రమేష్, గుల్లపల్లి నరసింహారెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎలగందుల నర్సింసింహులు, ఇల్లెందుల శ్రీనివాస్ రెడ్డి, ల్యాగల సతీష్, ముత్యాల చంద్రం తదితరులు పాల్గొన్నారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Advertisement

Latest Rajanna Sircilla News