సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్, వేములవాడ ఎమ్మెల్యేగా ఆది

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ ( Vemulawada Assembly Constituency )ఎమ్మెల్యే గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) విజయం సాధించారు.

సమీప భారాస అభ్యర్థి చలిమెడ లక్ష్మినరసింహ రావుపై 14,581 ఓట్ల మెజారిటీతో ఆది శ్రీనివాస్ గెలుపొందారు.

ఓట్ల లెక్కింపు, ఫ‌లితాల ప్ర‌క‌ట‌న అనంత‌రం కౌంటింగ్ పరిశీలకులు ఉదయన్ సిన్హా, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ ల సమక్షంలో రిటర్నింగ్ అధికారి మధు సూదన్ గెలుపు పత్రాన్ని ఆది శ్రీనివాస్ కు అందజేశారు.అలాగే సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గా భారాస పార్టీ అభ్యర్థి కే టి రామారావు( KTR ) విజయం సాధించారు.

KTR As Sirisilla MLA, Adi As Vemulawada MLA-సిరిసిల్ల ఎమ�

సమీప కాంగ్రెస్ అభ్యర్థి కే కే మహేందర్ రెడ్డి పై 29,687 ఓట్ల మెజారిటీతో కే టి రామారావు గెలుపొందారు.ఓట్ల లెక్కింపు, ఫ‌లితాల ప్ర‌క‌ట‌న అనంత‌రం ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్ సమక్షంలో రిటర్నింగ్ అధికారి ఆనంద్ కుమార్ గెలుపు పత్రాన్ని గెలుపొందిన కే టి రామారావు ప్రతినిధులకు అందజేశారు.

Advertisement

Latest Rajanna Sircilla News