ఈటలపై మొదటిసారి స్పందించిన కే.టి.ఆర్..!

టీ.ఆర్.

ఎస్ ను వీడిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

ఈటల వ్యవహారంలో ఇంతవరకు పెదవి విప్పని కే.టి.ఆర్ తొలిసారిగా ఈటల రాజేందర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈటల రాజేందర్ ను పార్టీలో కొనసాగాలని తాను ప్రయత్నించానని అన్నరు.

ఈటలకు టీ.ఆర్.ఎస్ ఎలాంటి నష్టం చేయలేదని అన్నారు కే.టి.ఆర్.టీ.ఆర్.ఎస్ ఇచ్చిన పదవులను అనుభవిస్తూ ఇతర పార్టీ నేతలతో ఈటల సంప్రదింపులు చేశారని మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడం.అవి ప్రజల దగ్గర మాట్లాడి సింపతీ తెచ్చుకోవాలని ప్రయత్నించడం వల్లే ఆయన పార్టీకి దూరమయ్యారని అన్నారు.

ఐదేళ్ల నుండి కే.సి.ఆర్ తో గ్యాప్ ఉంటే ఎందుకు ఈటల మంత్రిగా కొనసాగారు.ఐదేళ్ల నుండి ఈటల రాజేందర్ అడ్డంగా మాట్లాడినా సరే మంత్రిగా కే.సి.ఆర్ ఉంచారని అన్నారు కే.టి.ఆర్.ఈటల రాజేందర్ ఆత్మ వంచన చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు కే.టి.ఆర్.హుజురాబాద్ లో పార్టీల మధ్య పోటీ ఉందని వ్యక్తుల మధ్య కాదని అన్నారు కే.టి.ఆర్.హుజురాబాద్ లో టీ.ఆర్.ఎస్ గెలుపు ఖాయమని అన్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని అన్నారు కే.టి.ఆర్.ఏడేళ్లలో కేంద్రం ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు.చిల్లర రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ గా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు.

Advertisement
జీవీ ప్రకాష్ సైంధవి విడిపోవడానికి కారణాలివే.. ఆ రీజన్ వల్లే విడిపోతున్నారా?

తాజా వార్తలు