Krishnam Raju : ఆ హీరోయిన్‌కి అది 100వ సినిమా అయితే.. కృష్ణంరాజుకి ఫస్ట్ మూవీ..!

సాధారణంగా కొత్త హీరో పరిచయమవుతున్నప్పుడు అతనితోపాటు కొత్త హీరోయిన్ కూడా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతుంటుంది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan Tej )సినిమాతోనే నేహా శర్మ తన సినీ కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

 Krishnam Raju First Movie With Star Heroine-TeluguStop.com

బన్నీ ఫస్ట్ సినిమాలో కూడా కొత్త హీరోయిన్ అదితి అగర్వాల్ నటించింది.ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది కొత్త హీరోలు కొత్త హీరోయిన్లతోనే తన మొదటి సినిమా చేశారు కానీ రెబల్ స్టార్ కృష్ణంరాజు( Rebel star Krishnamraju ) మాత్రం 100 సినిమాలు తీసిన ఒక సీనియర్ హీరోయిన్ తో తన ఫస్ట్ మూవీ తీశాడు.

ఇది వినడానికి విచిత్రంగా అనిపించినా నమ్మాల్సిన నిజం.

Telugu Chilaka Gorinka, Pratyagatma, Krishna Kumari, Krishnam Raju, Ram Charan T

డెబ్యూ మూవీలో కొత్త వారితో కలిసి నటించడం ఈజీగా ఉంటుంది.వంద సినిమాలు అనుభవం ఉండి, అది కూడా ఓల్డ్ హీరోయిన్‌తో నటించడం అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.కృష్ణంరాజు మొదట నటించిన సినిమా “చిలకా గోరింకా”( Chilaka Gorinka ).ఇది 1966 లో వచ్చింది.ఇందులో కృష్ణకుమారి హీరోయిన్ గా నటించింది.

ఆమె కృష్ణంరాజు కంటే వయసులో నాలుగేళ్లు పెద్దది.కృష్ణకుమారి( Krishna Kumari ) కొత్త హీరోతో రొమాన్స్ చేయడానికి ఏమాత్రం సందేహించలేదు.కృష్ణంరాజు కూడా సినిమా అవకాశాల కోసం తిరిగి తిరిగి చివరికి చిలకా గోరింకాలో నటించడానికి ఒప్పుకున్నాడు.100 సినిమాల అనుభవం ఉన్న హీరోయిన్ పక్కనే నటించడానికి అతడు ఏమాత్రం భయపడలేదు.

Telugu Chilaka Gorinka, Pratyagatma, Krishna Kumari, Krishnam Raju, Ram Charan T

దర్శకుడు ప్రత్యగాత్మ కృష్ణంరాజుని కలిసినప్పుడు అతడిని తన సినిమాలో హీరోగా తీసుకుందాం అనుకున్నాడు.మొదటగా స్క్రీన్‌ టెస్ట్‌ చేసి, ఆపై తన నిర్మాణంలోనే తీసే సినిమాలో హీరోగా ఛాన్స్ ఇచ్చాడు.అయితే అప్పటికి కృష్ణంరాజుకి సినిమాల్లో నటించిన అనుభవంగానీ, అంతకుముందు నాటకాలు వేసిన ఎక్స్‌పీరియన్స్ గానీ లేదు.అందువల్ల అతడు ఈ మూవీలో హీరో పాత్ర చేయడానికి రెండేళ్లు నాటకాలు వేయాల్సి వచ్చింది.

అలాగే సినిమా కెమెరాల ముందు షూటింగ్స్‌లో ఎలా నటించాలో కూడా తెలుసుకున్నాడు.చివరికి కావాల్సినంత అనుభవం సంపాదించి ఈ మూవీలో అద్భుతంగా నటించాడు.సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు కానీ నందితో సహా కొన్ని అవార్డులను గెలుచుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube