కాంగ్రెసును ముంచడానికి సిద్ధమైన కోమటిరెడ్డి బ్రదర్స్: కందగట్ల అనంత ప్రకాష్

సూర్యాపేట జిల్లా:కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్( Komatireddy Brothers ) మీ శ్రీరంగనీతులు ఆపాలని,కమ్యూనిస్టులు సూత్రబద్ధ వైఖరిని అవలంబిస్తారని సిపిఎం పాలకవీడు మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ అన్నారు.

శుక్రవారం ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

బీజేపీని ఓడించాలని వ్యక్తుల గురించి ఆలోచించకుండా మునుగోడులో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న పరిస్థితుల్లో వారు శక్తి సరిపోదని బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి బీజేపీ ఓడించామని, నీవు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ గా ఉండి నీ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయలేక విదేశాలకు వెళ్ళి ఈరోజు నీతులు చెబుతావా అని ప్రశ్నించారు.నీ తమ్మున్ని వామపక్షాలు ఓడించారని కాంగ్రెసు-వామపక్షాల పొత్తును విచ్ఛిన్నం చేయటానికి పూనుకున్నావని ఆరోపించారు.

Komati Reddy Brothers Ready To Sink Congress: Kandagatala Anantha Prakash Komati

వాళ్ళు ఓడిపోతారని మా పార్టీకి వాళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ కావని చెప్పడం సిగ్గుమాలిన చర్యని, చేతగానితనానికి నిదర్శనమని అన్నారు.అంతేకాదు కమ్యూనిస్టులతో చిన్న రాష్ట్రం నాలుగు సీట్లు ఇస్తే వాళ్ళు ఓడిపోతారని, హంగు వస్తే ఇబ్బందని చెప్తున్న నీవు అదే హంగు వస్తే నీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు నువ్వు ఆపగలుగుతావా? గతంలో గెలిచిన వాళ్లని 12 మందిని ఎందుకు ఆపలేకపోయావన్నారు.ఈ రోజున రేవంత్ రెడ్డి( Revanth Reddy )ప కక్ష పెంచుకొని కాంగ్రెస్ పై కక్షబూని నష్టపరిచే ఆలోచనతో ఉన్న మీరు వామపక్షాలతో పొత్తుల చెడగొడుతున్నారని ఆరోపించారు.

ఉమ్మడి నల్లగొండ,ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామని ప్రగల్బాల్ పలికిన మీరు వామపక్షాలు లేకుండా అన్ని సీట్లు గెలిచే దమ్ము మీకుందా? ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.మంత్రి పదవుల ఆశ చూపి వామపక్షాలను లొంగదీసుకోవాలంటే అది కుదరదని హెచ్చరించారు.

Advertisement

దేశ ప్రధానిగా జ్యోతిబసు ప్రధానమంత్రిగా ఉండాలని బీజేపీ వ్యతిరేక పక్షాలు కోరిన మీదట మా బలం తక్కువ ఉన్నచోట మేం ప్రధానిగా ఉంటే మా ఎజెండా అమలు చేయలేమని తిరస్కరించిన చరిత్ర మాదని,అది గుర్తుపెట్టుకోవాలన్నారు.అవాకులు,చవాకులు మానుకో కమ్యూనిస్టులకు ఎవరు పెట్టుకున్నా సర్వనాశనం అవుతారని గుర్తుంచుకోవాలి హెచ్చరించారు.

గ్రూప్-1 లో ఫలితాల్లో హుజూర్ నగర్ ఎమ్మార్వోకు 488 మార్కులు
Advertisement

Latest Suryapet News