దివ్యాంగురాలికి అండగా నిలిచిన కేకే

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన గొట్టే సుమలత పుట్టుకతోనే దివ్యాంగురాలు.చదువుకోవడానికి తన అంగవైకల్యం అడ్డు రాలేదు.

ఉన్నత చదువులు చదివింది కానీ ఉపాది లేకుండా ఉండి పోయుంది.తల్లిదండ్రులు ఇద్దరూ వృద్దులు కావడంతో పనిచేయని స్థితిలో ఉండడంతో తనకొచ్చె పెన్షన్ డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తుంది.

ఏదైనా ఉపాధి చూపాలని గత ప్రభుత్వ పెద్దలను ఎన్నోసార్లు కలిసినా పట్టించుకోలేదని సుమలత ఆవేదన వ్యక్తం చేసింది.తనకు ఏదైన ఉపాధి చూపాలని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డిను కలిసి అడిగింది.

వెంటనే స్పందించిన కేకే మహేందర్ రెడ్డి కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కు విషయం తెలియజేశాడు.వెంటనే స్పందించిన కలెక్టర్.

Advertisement

సిస్టం ఆపరేటర్ గా ఉద్యోగం కల్పించాడు.తనకు అండగా ఉండి ఉద్యోగ భరోసా కల్పించిన కేకే మహేందర్ కి సుమలత వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎల్లారెడ్డిపేటలో బిఆర్ఎస్ పార్టీ ధర్నా ,రాస్తారోకో.ఎం ఆర్ ఓ కు వినతి పత్రం సమర్పణ.
Advertisement

Latest Rajanna Sircilla News