మూడు రాజధానులపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

ఏపీలో మూడు రాజధానులపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన ఆయన ఆర్కేఆర్ కాలేజీలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనని చెప్పారు.రాజధాని ఏర్పాటు అనేది ప్రజాభిప్రాయం ప్రకారం జరగాలని తెలిపారు.

అమరావతి అభివృద్ధికి తాను మంత్రిగా ఉన్నప్పుడే నిధులు మంజూరు చేశానన్న ఆయన దాన్ని బట్టే అందరికీ అర్ధమూ ఉంటుందని అనుకుంటున్నానని క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు