భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia )మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్లు పూర్తయిన సంగతి తెలిసిందే.ఈ సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.
శుక్రవారం రాయపూర్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరుగునుంది.ఈ మ్యాచ్లో గెలిచి మరో మ్యాచ్ ఆడాల్సి ఉండగానే సిరీస్ కైవసం చేసుకునేందుకు భారత జట్టు కీలక మార్పులతో బరిలోకి దిగనుంది.
ఈ సిరీస్ లో భారత్ మూడో మ్యాచ్లో భారీ స్కోర్ నమోదు చేసినప్పటికీ.ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ( Glenn Maxwell )చెలరేగడంతో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ఇక నాలుగో మ్యాచ్లో తప్పక గెలవడం కోసం భారత జట్టులో జరిగే కీలక మార్పులు ఏమిటో చూద్దాం.

వన్డే వరల్డ్ కప్ ఆడిన శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్ లో చివరి రెండు టీ20 మ్యాచ్ లకు జట్టులోకి వస్తున్నాడు.అంతేకాదు రెండు టీ20 మ్యాచ్ లకు శ్రేయస్ అయ్యర్( Shreyas Iyer ) వైస్ కెప్టెన్ గా కూడా ఉండనున్నాడు.దీంతో ప్రస్తుతం జట్టులో ఉండే ఏ సభ్యుని పక్కన పెట్టాలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు కాస్త తలనొప్పిగా మారింది.
అయితే తిలక్ వర్మ( Tilak Varma ) బెంచ్ కు పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.సూర్య కుమార్ యాదవ్ కూడా తిలక్ వర్మను బెంజ్ కు పరిమితం చేసి, శ్రేయస్ ను ఎంచుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

ఈ సిరీస్ లో మూడవ టీ20 మ్యాచ్లో భారత జట్టు బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు.ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్ ఇద్దరు కూడా చివరి రెండు మ్యాచ్లకు బెంజ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది.ముఖేష్ కుమార్ నాలుగో టీ20 కి తిరిగి జట్టులోకి రానున్నాడు.ఇక దీపక్ చాహర్( Deepak Chahar ) కు నాలుగో టీ20 మ్యాచ్ లో అవకాశం దక్కనుంది.
మరొకవైపు ఆస్ట్రేలియా జట్టు కూడా నాలుగో టీ20 మ్యాచ్ లో గెలిచి సిరీస్ ఆశలు సజీవంగానే ఉంచుకోవాలని భావిస్తోంది.