నాని నెక్స్ట్ స్టెప్ ఏంటో ? 

చాలాకాలం నుంచి విజయవాడ ఎంపీ కేసినేని నాని వ్యవహారం వివాదాస్పదంగా నే ఉంటూ వస్తోంది.

రెండోసారి టిడిపి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన నాని( Keineni nani )కి ఆ పార్టీలో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి.

విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని టిడిపి కీలక నాయకులతో ఆయనకు విభేదాలు రావడం,  వారిని ప్రోత్సహించే విధంగా పార్టీ అధిష్టానం వ్యవహరించడం, తనకు ప్రాధాన్యాన్ని తగ్గించి , తనకు సోదరుడు కేశినేని చిన్నికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఎలా ఎన్నో విషయాలు నానికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.అప్పుడప్పుడు సొంత పార్టీ నాయకులు పై అనేక సంచలన విమర్శలు చేశారు.

తాజాగా తిరువూరు టిడిపి కార్యాలయంలో చోటు చేసుకున్న వివాదం తదితర పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం నాని విషయంలో ఏదో ఒకటి తేల్చాలని నిర్ణయించుకుని, ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించింది.దీంతో అసంతృప్తికి గురైన నాని టిడిపికి రాజీనామా చేశారు.

Keineni Nani Nani Political Strategy , Keineni Nani, Tdp, Janasena, Bjp, Ap Gove

 ఆయనతోపాటు తన కుమార్తె శ్వేతతో( Keineni swetha )కూడా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయించారు.దీంతో వచ్చే ఎన్నికల్లో నాని ఏ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అనేది అందరికీ ఆసక్తికరంగానే మారింది.ఆయన బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నా.

Advertisement
Keineni Nani Nani Political Strategy , Keineni Nani, Tdp, Janasena, Bjp, Ap Gove

టిడిపి తో పొత్తు పెట్టుకునే దిశగా బిజెపి( bjp ) ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యంలో ఆ పార్టీలో చేరినా తనకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని నాని అంచనా వేస్తున్నారు పొత్తు కుదిరినా విజయవాడ ఎంపీ టికెట్ చంద్రబాబు సూచించిన వారికే దక్కుతుందని , అలా కాకుండా పొత్తులో భాగంగా బిజెపి నుంచి విజయవాడ ఎంపీగా తాను పోటీ చేసినా,  తన ఓటమికి టిడిపి కృషి చేస్తుందని నాని అంచనా వేస్తున్నారు.దీంతో ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనేది నాని తేల్చుకోలేకపోతున్నారు.

వైసీపీ నుంచి ఆయనకు ఆహ్వానాలు అందుతున్నా సైలెంట్ గానే ఉంటున్నారు.

Keineni Nani Nani Political Strategy , Keineni Nani, Tdp, Janasena, Bjp, Ap Gove

విజయవాడ ఎంపీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వైసిపి అనేక వ్యూహాలు రచిస్తోంది.ఇప్పటికే అక్కడ బీసీ అభ్యర్థిని పోటీకి దించాలని జగన్( YS jagan ) నిర్ణయించుకున్నారు .ఒకవేళ నాని పార్టీలో చేరితే ఆయనకు ఆ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది .నాని స్వతంత్రంగా పోటీ చేస్తే ఆయన టిడిపి ఓట్లనే చీల్చుతారని , అంతిమంగా తమకే మేలు జరుగుతుందనే అంచానాలో వైసిపి ఉంది.కాకపోతే ఈ విషయంలో నాని ఏ స్టెప్ తీసుకుంటారు అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తోంది.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు