కీర్తి క్యారెక్టర్ ను మోస్ట్ ఫన్నీగా డిజైన్ చేసిన పరశురామ్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.

గత సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మహేష్ బాబు సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వంలో వెంటనే సర్కారు వారి పాట సినిమా మొదలు పెట్టాడు.ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్ లో పూర్తి చేసుకుని రీసెంట్ గా రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యి కరోనా కారణంగా వాయిదా పడింది.

పరుశురాం ఈ సినిమాను సామజిక అంశంతో తెరకెక్కిస్తున్నాడు.బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి ఈ సినిమాలో చూపించ బోతున్నారు.

ఈ సినిమా లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.అయితే ఇప్పుడు కీర్తి సురేష్ ఈ సినిమా చేస్తున్న రోల్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా చర్చ జరుగుతుంది.

Advertisement
Keerthy Suresh Role In Mahesh Sarkaru Vaari Paata Movie, Mahesh Babu, Sarkaru Va

ఈ సినిమాలో ఈమె స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందట.

Keerthy Suresh Role In Mahesh Sarkaru Vaari Paata Movie, Mahesh Babu, Sarkaru Va

ఈ సినిమాలో కీర్తి మహేష్ బాబుకు సబార్డ్ నెట్ గా కనిపిస్తుందని ఈమె పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తుంది.ఇప్పటి వరకు పరుశురామ్ సినిమాల్లో హీరోయిన్స్ సీరియస్ పాత్రల్లో కనిపించారు.కానీ మొదటిసారిగా పరుశురామ్ తన సినిమాలో హీరోయిన్ పాత్రను మోస్ట్ ఫన్నీగా తీర్చి దిద్దారని తాజాగా వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో మహేష్ కీర్తి మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని చెప్పుకుంటున్నారు.కీర్తి పాత్ర కూడా చాలా హిలేరియస్ గా ఉండే విధంగా పరశురామ్ తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.

ఇప్పటికే 25 శాతం మేరకు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా ను వచ్చే సంవత్సరం 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు