Kaleshwaram : ఈనెల 13న ఎమ్మెల్యేల కాళేశ్వరం సందర్శన..!!

తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నెల 13వ తేదీన ఎమ్మెల్యేలను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్లాలని నిర్ణయించింది.

ఈ మేరకు శాసనసభలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలతో పాటు శాసనమండలిలో ఉన్న 40 మంది సభ్యులు ప్రాజెక్టు సందర్శనకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆహ్వానించారు.13 ఉదయం 10 గంటలకు శాసనసభ నుంచి ప్రాజెక్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రేవంత్ రెడ్డి ( Revanth Reddy )స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అందరికీ తెలియాలని ఆయన చెబుతున్న సంగతి తెలిసిందే.అలాగే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy )కి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.కాగా ఈనెల 12తో అసెంబ్లీ సమావేశాలు ముగియనుండగా.13న కాళేశ్వరం సందర్శనకు ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు